BREAKING
మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం* ఎన్నికల సామగ్రి అప్పగించే వరకు పోలింగ్ విధులు కొనసాగాల్సిందే: గుజరాత్ ఎన్నికల సంఘం స్పష్టీకరణ! పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలు: జూన్ ఆటో అమ్మకాల్లో జోరు: టీవీఎస్ సేల్స్ 47 శాతం, బజాజ్ ఆటో 28 శాతం జంప్.. అంచనాలను మించిన వృద్ధి! అమెరికాకు అసాధారణ ప్రతిభావంతులు మాత్రమే కావాలి: నేటి రాశి ఫలాలు: 9 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 9 అక్టోబర్ 2026 శుక్రవారం పిఆర్టియు నారాయణపేట మండల అధ్యక్షులుగా మొల్గాన్ జనార్ధన్ 5 వ వార్డులో తడి పొడి కి చెత్త బుట్టలు పంపిణీ జర్నలిస్టులు నిజాయితీగా వార్తలు రాయాలి.. తప్పుడు కథనాలు రాస్తే శిక్షార్హులు.. పోలీసులు, మీడియా సమన్వయంతో పనిచేయాలి : ఎస్పీ వినీత్ సాకి చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సినిమాకు భారీ నష్టం.. ఏకంగా రూ.1,350 కోట్లు గల్లంతు! ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం* కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడం శోచనీయం

ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: అదనపు కలెక్టర్ శ్రీరాములు

Select Suryaa Now
ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు  రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: అదనపు కలెక్టర్ శ్రీరాములు

 సూర్య పెద్దపల్లి ప్రతినిధి

ఖరీఫ్–2026 ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మండలాల వారీగా పంట కోతల షెడ్యూల్‌కు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, తేమ శాతం కొలిచే పరికరాలు, ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎఫ్‌ఏక్యూ నాణ్యత ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీమాల, ఎస్‌డబ్ల్యూసీ రీజినల్ మేనేజర్, సంబంధిత శాఖల అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.