మురుగు కాలువల పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు
– 20 మంది అదనపు కార్మికుల నియామకం
గిద్దలూరు మేజర్ న్యూస్ : గిద్దలూరు పట్టణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మురుగు కాలువలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని గౌరవ గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని మురుగు కాలువల శుభ్రత కోసం దినసరి వేతన ప్రాతిపదికన 20 మంది అదనపు పారిశుధ్య కార్మికులను నియమించారు. పట్టణంలోని మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలను తొలగించి నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలని, పారిశుధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని వాటర్ బోర్డు కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సూచించారు. ప్రజల ఆరోగ్యం, పారిశుధ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సయ్యద్ షాహాన్ షా వలి,నంది శ్రీనివాసులు, దుత్తా బాల ఈశ్వరయ్య, లొక్కు రమేష్, మండ్ల శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు*