BREAKING
ఎల్నినో ప్రభావంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం ఆంగ్ల భాష పై నైపుణ్యం సాధించాలి - కలెక్టర్ దివాకర నరజాముల తాండలో వివాదాస్పద భూములపై ఆర్డివో తనిఖీ వచ్చే మార్చిలోగా జిల్లాలో రైతులందరికీ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు -- సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని తో కలిసి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్ వెట్రి సెల్వి కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు.. నమూనాల సేకరణ. ఫార్మర్ రిజిస్ట్రేషన్ పరిశీలించిన. జిల్లా వ్యవసాయ అధికారి. మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన కాంగ్రెస్ నాయకులు... స్టేషన్ రోడ్డులో నీళ్ళు రావడం లేదు గుండాల ఆసుపత్రి సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు ? నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి మనిషి బ్రతికుంటే ఓటు కావాలి చనిపోతే ఆరడుగుల స్థలం దొరకని దుస్థితి అమిత్ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో దైవాలరావూరు భూములకు విముక్తి. రోడ్డుకు ఇరువైపుల గల, పిచ్చి మొక్కలు తొలగింపు. భద్రాచలం రహదారి సమస్యపై హరీష్ రావుకు వినతి.

ఆర్డిఓ మున్సిపల్ వార్డు సెక్రటరీలు పంచాయతీ సెక్రటరీతో సమీక్ష సమావేశం సమావేశం

Select Suryaa Now
ఆర్డిఓ మున్సిపల్ వార్డు సెక్రటరీలు పంచాయతీ సెక్రటరీతో సమీక్ష  సమావేశం సమావేశం

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ 48 వార్డులుగా విభజన

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో విలీనమైన ఐదు గ్రామాలతో 2021 సంవత్సరం లో సిద్ధం చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా విభజించిన 40 వార్డులను, జనవరి 2026 ఓటర్ల జాబితా ఆధారంగా 48 వార్డులుగా పునర్విజించేందుకు  అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తాడేపల్లిగూడెం  రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం సూర్యారావు చెప్పారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వార్డు మరియు పంచాయతీ సెక్రెటరీ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో సూర్యారావు మాట్లాడుతూ ఒక్కొక్క వార్డు 2510 ఓటర్లు చొప్పున 10 శాతం కట్ ఆఫ్ అయినా సుమారుగా ఓటర్ల జాబితాను సవరించి నివేదికను త్వరిగా సిద్ధం చేయాలని ఆర్డీవో సూర్యారావు వార్డు సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. వార్డు సరిహద్దులు సక్రమంగా గుర్తించి విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైతే రాజకీయ పార్టీ లీడర్స్ సలహాలు సూచనలు తీసుకుని వార్డుల  ఫైనల్ లిస్టు సిద్ధం చేయాలని ఆర్డీవో సూర్యారావు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబు మాట్లాడుతూ  మున్సిపాలిటీఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునందున దానిలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ కూడా ఉన్నందున వేగవంతంగా మున్సిపల్ వార్డులు జాబితాను వార్డులు వారీగా వివరాలు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారని, తాడేపల్లిగూడెం మండలంలో కుంచనపల్లి, ఎల్లగ్రహారం, పడాల, ప్రత్తిపాడు, కోండ్ర ప్రోలు 5 గ్రామాలు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ లో విలీనం చేయడం వలన 48వార్డులు గా విభజించి అధికారులు కు మొదటి విడతగా నివేదిక పంపినట్లు కమిషనర్ ఏసుబాబు తెలిపారు. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమిషనర్ భవాని బాబు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జి సీతారాం, మున్సిపల్ వార్డు సెక్రటరీలు పంచాయతీ సెక్రెటరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా