BREAKING
ఎల్నినో ప్రభావంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం ఆంగ్ల భాష పై నైపుణ్యం సాధించాలి - కలెక్టర్ దివాకర నరజాముల తాండలో వివాదాస్పద భూములపై ఆర్డివో తనిఖీ వచ్చే మార్చిలోగా జిల్లాలో రైతులందరికీ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు -- సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని తో కలిసి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్ వెట్రి సెల్వి కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు.. నమూనాల సేకరణ. ఫార్మర్ రిజిస్ట్రేషన్ పరిశీలించిన. జిల్లా వ్యవసాయ అధికారి. మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన కాంగ్రెస్ నాయకులు... స్టేషన్ రోడ్డులో నీళ్ళు రావడం లేదు గుండాల ఆసుపత్రి సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు ? నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి మనిషి బ్రతికుంటే ఓటు కావాలి చనిపోతే ఆరడుగుల స్థలం దొరకని దుస్థితి అమిత్ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో దైవాలరావూరు భూములకు విముక్తి. రోడ్డుకు ఇరువైపుల గల, పిచ్చి మొక్కలు తొలగింపు. భద్రాచలం రహదారి సమస్యపై హరీష్ రావుకు వినతి.

అధునాత‌న వ‌స‌తుల‌తో డిస్ట్రిక్ట్ సెంట్ర‌ల్ లైబ్ర‌రీ

Select Suryaa Now
అధునాత‌న వ‌స‌తుల‌తో డిస్ట్రిక్ట్ సెంట్ర‌ల్ లైబ్ర‌రీ

విశాఖ ఎడ్యుకేషన్, సూర్య : ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యంలో దాదాపు రూ 70 కోట్ల వ్య‌యంతో అత్యాధునిక వ‌స‌తుల‌తో డిస్ట్రిక్ట్ సెంట్ర‌ల్ లైబ్ర‌రీ ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌తిపాద‌న వ‌చ్చింద‌ని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ అన్నారు. మెత్తం 80 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో దీని నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు. ఏయూకు 40 వేల చ‌ద‌ర‌పు అడుగులు కేటాయించార‌న్నారు. మిగిలిన 40 వేల చ‌ద‌ర‌పు అడుగులు పౌర గ్రంధాల‌యానికి కేటాయించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. సింగిల్ ఐకానిక్ బిల్డింగ్‌గా దీనిని నిర్మిస్తార‌ని, ఏయూ విద్యార్థులు సైతం పౌర గ్రంధాల‌యాన్ని వినియోగించుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

మెద‌టి అంత‌స్థులో మ‌ల్టీ ప‌ర్స‌స్ హాల్ 200 కెపాసిటీ, ఎరైవ‌ల్ లాబీ, ఎగ్జిబిష‌న్ డిస్‌ప్లే, కాఫీ కియోస్క్‌, టాయిలెట్స్‌, లిఫ్ట్ వంటివి ఉంటాయ‌ని, లెవెల్ 1 క‌లెక్ష‌న్‌-రీడింగ్ వ‌స‌తులు న్యూస్ పేప‌ర్స్‌, పీరియాడిక‌ల్స్ రీడింగ్ కి సీటింగ్‌, అడ్మిన్ స్టాఫ్‌, ఓపెన్ క‌లెక్ష‌న్‌, జ‌న‌ర‌ల్ రీడింగ్ రూమ్ 100 కెపాసిటి, లోన్ రీడింగ్ రూమ్, గ్రూప్ డిస్క‌ష‌న్ రూమ్‌లు, సెమినార్ రూమ్‌, లెవెట్ 2లో డిజిట‌ల్ లైబ్ర‌రీగా విద్యార్థుల‌కు ఉప‌యుక్తంగా మ‌ల్టీ మీడియా 80 సిస్ట‌మ్స్‌, కంప్యూట‌ర్ సెంట‌ర్ 120 సిస్టమ్స్‌తో,  కాన్ఫ‌రెన్స్ రూమ్‌, సెమినార్ రూమ్‌, ఇంగ్లీష్ లాబ్‌లు 2, డిజిట‌ల్ అక‌డ‌మిక్ రూమ్‌, లెవెల్ 3లో రిఫ‌రెన్స్ క‌లెక‌ష‌న్స్‌, రీడింగ్‌, పోటీ ప‌రీక్ష‌ల కోసం ఇత‌ర వ‌స‌తులు ఉంటాయ‌న్నారు. మెత్తం 70 కోట్ల బ‌డ్జెట్‌లో ఏయూ 6-7 కోట్లు వ‌ర‌కు వెచ్చిస్తుంద‌న్నారు. సెంటిన‌రీ ప్రాజెక్టుల‌లో ఒక ఐకానిక్ భ‌వ‌నంగా ఇది నిలుస్తుంద‌న్నారు. ప్ర‌స్తుతం డ్రాఫ్ట్ ద‌శ‌లో ఉంద‌ని, త్వ‌ర‌లో టెండ‌రింగ్‌కి వెళ్లి ప‌నులు ప్రారంభించే అవ‌కాశం ఉంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌కారంతో దీని నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు. భ‌వ‌న నిర్మాణానికి మూడు ప్రాంతాలు ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని, వీటిలో ఒక‌టి నిర్మాణానికి ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

 

రిపోర్టర్ : సత్యనారాయణ, ఏయూ, విశాఖపట్నం.