BREAKING
రాజమహేంద్రవరంలో పోషణ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎంపీ పురందేశ్వరి ఆదిలాబాద్ రిమ్స్‌ అగ్నిప్రమాదం: ఇద్దరు పసికందుల మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న విఆర్ఏల ధర్నా ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవం శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్టీయు కృత్రిమ మేధస్సు ప్రమాదాల కట్టడికి గ్లోబల్ రెగ్యులేటరీ సంస్థ: 20 దేశాల కీలక ఉమ్మడి ప్రతిపాదన గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత వీఎల్‌ఎస్‌ఐ సాంకేతికతతో తదుపరి తరం బయోసెన్సర్‌ డిజైన్‌పై వర్క్‌షాప్ రాయవరంలో వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక ద్రవ్యోల్బణ సెగతో ఆర్బీఐ కీలక నిర్ణయం?: 2026లో రెండుసార్లు వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చన్న నివేదిక ఐరాస వేదికగా దౌత్య పర్వం పాకిస్తాన్‌లో మరో పరువు హత్య: నవవధువును కాల్చి చంపిన సొంత సోదరుడు.. కరాచీలో దారుణం ప్రభుత్వ కార్యాలయంలోనే దొంగతనం.. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం తప్పనిసరి నల్ల సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛకు భారత్ సహకారం స్లాఘనీయం

రూ.9 చీరల కోసం ఎగబడ్డ మహిళలు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాల్ ఓపెనింగ్‌లో తోపులాట

Select Suryaa Now
రూ.9 చీరల కోసం ఎగబడ్డ మహిళలు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాల్ ఓపెనింగ్‌లో తోపులాట

సూర్య క్రైమ్ డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రముఖ నటి మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ప్రారంభమైన గరుడ షాపింగ్ మాల్ నిర్వాహకులు గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా కేవలం రూ.9లకే ఒక చీర ఇస్తామని భారీ ప్రకటన చేశారు. ఈ బంపర్ ఆఫర్ గురించి తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు పెద్ద ఎత్తున మాల్ వద్దకు పోటెత్తారు.

తక్కువ ధరకే చీరను దక్కించుకోవాలన్న ఆత్రుతతో మహిళలు ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. జనాలను అదుపు చేయడం సెక్యూరిటీ సిబ్బందికి తలకు మించిన భారంగా మారడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పి గందరగోళంగా మారింది. ఈ తొక్కిసలాట మరియు తోపులాటలో పలువురు మహిళలకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఆఫర్ల పేరుతో నిబంధనలు పాటించకుండా సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు మండిపడుతున్నారు.