BREAKING
రాజమహేంద్రవరంలో పోషణ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎంపీ పురందేశ్వరి ఆదిలాబాద్ రిమ్స్‌ అగ్నిప్రమాదం: ఇద్దరు పసికందుల మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న విఆర్ఏల ధర్నా ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవం శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్టీయు కృత్రిమ మేధస్సు ప్రమాదాల కట్టడికి గ్లోబల్ రెగ్యులేటరీ సంస్థ: 20 దేశాల కీలక ఉమ్మడి ప్రతిపాదన గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత వీఎల్‌ఎస్‌ఐ సాంకేతికతతో తదుపరి తరం బయోసెన్సర్‌ డిజైన్‌పై వర్క్‌షాప్ రాయవరంలో వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక ద్రవ్యోల్బణ సెగతో ఆర్బీఐ కీలక నిర్ణయం?: 2026లో రెండుసార్లు వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చన్న నివేదిక ఐరాస వేదికగా దౌత్య పర్వం పాకిస్తాన్‌లో మరో పరువు హత్య: నవవధువును కాల్చి చంపిన సొంత సోదరుడు.. కరాచీలో దారుణం ప్రభుత్వ కార్యాలయంలోనే దొంగతనం.. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం తప్పనిసరి నల్ల సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛకు భారత్ సహకారం స్లాఘనీయం

ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం.. ఏసీ పేలి ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

Select Suryaa Now
ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం.. ఏసీ పేలి ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

సూర్య క్రైమ్ డెస్క్: ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ (SNCU) వార్డులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ ఒక్కసారిగా పేలిపోవడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో కేవలం ఐదు రోజుల వయసున్న పసికందు ఊపిరాడక మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ ఘటనతో వార్డులో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మిగిలిన చిన్నారులను పక్క వార్డుకు సురక్షితంగా తరలించారు. ఈ ప్రమాద సమయంలో వార్డులో చికిత్స పొందుతున్న మొత్తం 24 మంది చిన్నారులను వేగంగా వేరే ప్రాంతాలకు మార్చగా, వారిలో ముగ్గురి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు రిమ్స్‌కు చేరుకున్నారు. పరిస్థితిని స్వయంగా సమీక్షించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం లేదా సాంకేతిక లోపాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు, బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.