BREAKING
ఇంటికే మీ సేవలు.. హైదరాబాద్‌లో మీ సేవ డోర్‌ డెలివరీ ప్రారంభం కాళేశ్వరం కట్టింది.. కూల్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే: ఉత్తమ్ పెళ్లిపై సంచలన కామెంట్స్ చేసిన శృతి హాసన్.. ఆ పెళ్లికి చాలా దగ్గరగా వెళ్లి ఆగిపోయా! తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం తక్కల్లపల్లిలో భారీ కొండ చిలువ ప్రత్యక్షం. ఉచిత బస్సుల్లో మహాలక్ష్మి లు ఆల్ టైం రికార్డ్ రెవెన్యూ సేవలకు నేడు వీఆర్ఏలు సహాయ నిరాకరణ విశాఖ నుంచి జనసేన మేయర్ ను కానుకగా పవన్ కళ్యాణ్ కు అందిద్దాం స్వచ్ఛతే మన బాధ్యత పరిశుభ్రతే మన భవిష్యత్తు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానం పోలీస్ శాఖలో 11 వేల పోస్టులు ఖాళీగా ఉంటే 2050 పోస్టు విడుదల చేయడం దారుణం -ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జి నాగరాముడు దుర్గపు సుజాత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం అహ్మదాబాద్‌కు రేపు మంత్రి నారా లోకేష్ గాజాలోని బురెయిజ్ శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దళాల కాల్పులు: పాలస్తీనా మహిళ దుర్మరణం బెంగళూరు–విజయవాడ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్టీయు

Select Suryaa Now
శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై జరిగిన దాడిని  తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్టీయు

-దాడులకు యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి 

-రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం STU AP

సోమవారం శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనను STU  తీవ్రంగా ఖండిస్తోందని, ఓ బాధ్యత కలిగిన ఉపాధ్యాయ సంఘంగా జరుగుతున్న పరిణామాలను చూస్తూ మౌనంగా ఉండలేకపోతున్నాం. అని సంఘ నాయకుల ముఖ్య సమావేశంలో జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి ఆజాం బేగ్, రాష్ట్ర అదనపు కార్యదర్శి వెంకటరామిరెడ్డి, శివశంకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలియజేశారు.  తమపై బురద జల్లొద్దని, తమ గౌరవానికి భంగం కలిగించవద్దంటూ ఉపాధ్యాయులే సమావేశాలు, నిరసనలు చేపట్టాల్సిన పరిస్థితి రావడం బాధాకరమైతే... ఇవాళ శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటన మరింత ఆవేదన కలిగిస్తోంది. ఉపాధ్యాయులను, ఉద్యోగులను రాజకీయాల్లోకి లాగడం, వాస్తవాలు నిర్ధారించకుండానే వారిపై ముద్ర వేయడం సరికాదని భావిస్తున్నాం. ఉద్యోగులు, ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, రాజకీయ పార్టీల మీద ఉంటుంది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకూడదు. ఉపాధ్యాయులపై దాడులకు ప్రయత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
DSC పరీక్షలో పాల్గొని అర్హత మార్కులు సాధించి , వారు వద్ద ఉన్న సర్టిఫికెట్లను కూడా చూపుతున్న విషయాలను కూడా పట్టించుకోకుండా మొత్తం ఉపాధ్యాయుల నియామకాలన్నీ తప్పు అని చెప్పడం సరైన చర్య కాదు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు గోపాలకృష్ణ, నాగేంద్ర కుమార్, జిల్లా ఆర్థిక కార్యదర్శి నూరుల్లా, నరసింహారావు, నాగేశ్వర నాయక్, సుబ్బయ్య, ఎల్లా సుబ్బయ్య , సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి , గురునాదు , రామిరెడ్డి, దేవేందర్ రెడ్డి, బదుల్లా,తదితరులు పాల్గొన్నారు.