నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న విఆర్ఏల ధర్నా
-మద్దతు ప్రకటించిన జిల్లా వాల్మీకులు సంఘం
నంద్యాల అర్బన్:
నంద్యాల జిల్లా కేంద్రంలోని నంద్యాల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏడవ రోజు వీఆర్ఎ లు ధర్నా నిర్వహించారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు నారాయణ, గౌరవ అధ్యక్షుడు మౌలాలి, వీఆర్ఏలు శివ, శివలింగం, జయ కృష్ణ, వర ప్రసాద్, నరసింహ, బ్రహ్మ, తదితరులు పాల్గొన్నారు. వి ఆర్ ఏ దీక్షకు జిల్లా వాల్మీకులు సంఘం మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా వి ఆర్ ఏ సంఘం నాయకులు మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుండి వి ఆర్ ఏ లు సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నామన్నారు. వీఆర్ లకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీలను వీఆర్ ఓ లుగా నియమించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రాల్లో సహాయ నిరాకరణ ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం అన్నారు. అర్హులైన వి ఆర్ ఏ లకు ప్రమోషన్స్ ఇవ్వాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత పోరాటం చేస్తామన్నారు. ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో వీఆర్ఏలకు హామీ ఇచ్చారని ఇచ్చిన హామీల ప్రకారం వీఆర్ఏల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల ధర్నాకు నంద్యాల జిల్లా వాల్మీకులు ప్రకటించారు.