BREAKING
రాజాబాబుకు చక్రాల కుర్చీ.. కుటుంబానికి కొత్త ఆశ వికారాబాద్ లో వినాయక మండపాలను సందర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 108 వాహనంలో మహిళ ప్రసవం రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్ వీఆర్ కు బదిలీ మంత్రి శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎస్ఈ సదానందం 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. ఏక్తా నగర్ డోమ్‌లో 1000 మంది అతిథుల మధ్య ఘనంగా ప్రదానోత్సవం! 11వ ఆయుర్వేద దినోత్సవం బిగ్‌బాస్‌లో రగిలిన నామినేషన్ల మంటలు.. చరణ్, ముఖేష్ మధ్య ఘోరమైన ఫైట్! అల్పపీడనం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం గోవింద నామస్మరణతో మారుమోగిన తిరుమాడ వీధులు వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ వార్డులో రోడ్డు కబ్జా.. స్పందించిన అధికారులు నోటీసులు జారీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ (HAM) ద్వారా రూ.164 కోట్లతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు- కలెక్టర్ రాజకుమారి గణియా కుప్పంలో కృష్ణమ్మ పరవళ్లు.. కృష్ణా జలాలకు ఘనంగా జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు!

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న క్రూజర్ వాహనం, ఇద్దరు మృతి!

Select Suryaa Now
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న క్రూజర్ వాహనం, ఇద్దరు మృతి!

సూర్య తెలంగాణ డెస్క్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆక్టోపస్ వ్యూ పాయింట్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన క్రూజర్ వాహనం ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్‌ను అత్యంత బలయంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో గాయపడిన మరికొంత మందిని వెంటనే చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో వాహనాల అతివేగం మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన బాధితుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.