BREAKING
రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్ వీఆర్ కు బదిలీ మంత్రి శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎస్ఈ సదానందం 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. ఏక్తా నగర్ డోమ్‌లో 1000 మంది అతిథుల మధ్య ఘనంగా ప్రదానోత్సవం! 11వ ఆయుర్వేద దినోత్సవం బిగ్‌బాస్‌లో రగిలిన నామినేషన్ల మంటలు.. చరణ్, ముఖేష్ మధ్య ఘోరమైన ఫైట్! అల్పపీడనం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం గోవింద నామస్మరణతో మారుమోగిన తిరుమాడ వీధులు వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ వార్డులో రోడ్డు కబ్జా.. స్పందించిన అధికారులు నోటీసులు జారీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ (HAM) ద్వారా రూ.164 కోట్లతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు- కలెక్టర్ రాజకుమారి గణియా కుప్పంలో కృష్ణమ్మ పరవళ్లు.. కృష్ణా జలాలకు ఘనంగా జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు! శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న క్రూజర్ వాహనం, ఇద్దరు మృతి! 'ది ప్యారడైజ్' ఈవెంట్‌లో రాఘవ్ జుయల్, సుమ డ్యాన్స్ హంగామా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్! గణేష్ నిమజ్జనం నేపథ్యంలో 3 రోజులు మద్యం దుకాణాలు బంద్ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 16న మూడు రాష్ట్రాల్లోని 12 స్థానాలకు పోలింగ్!

శ్రీశైలంలో తగ్గుతున్న నీటి నిల్వలు

Select Suryaa Now
శ్రీశైలంలో తగ్గుతున్న నీటి నిల్వలు

శ్రీశైల జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. జలాశయం నుండి వివిధ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయటంతోపాటు తెలంగాణ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో డ్యామ్ నీటిమట్టం రోజురోజుకు క్రమంగా తగ్గుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు. కాగా మంగళవారం మధ్యాహ్నం సమయానికి నీటిమట్టం 857.20 అడుగులుగా, నీటి నిల్వ సామర్థ్యం 97.8234 టీఎంసీలుగా నమోదైంది. భూగర్భ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 21,189 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే గడిచిన 24 గంటల వ్యవధిలో శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా వివిధ ప్రాజెక్టులకు 26,059 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.