మంత్రి శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎస్ఈ సదానందం
మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్ఈ సదానందం.
కర్తవ్య నిర్వహణలో అంకితభావం చాటాలని పిలుపు
కాటారం, సెప్టెంబర్ 22 ,మేజర్ సూర్య న్యూస్: జిల్లా సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్ఈ)గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాగెళ్లి సదానందం మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రోటోకాల్‌లో భాగంగా మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి చేశారు . ఈ సందర్భంగా ఎస్ఈ సదానందానికి మంత్రి శ్రీధర్‌బాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా, అంకితభావంతో పనిచేసి జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డి ఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ...