BREAKING
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడుల ఉధృతి: ముగ్గురు మృతి.. ఐరాస సదస్సు కోసం అమెరికాలో జెలెన్‌స్కీ అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు: దసరా ముందే పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు! నిజాంపేట భవ్యాస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో అట్టహాసంగా వినాయక చవితి వేడుకలు వినాయక నిమజ్జనానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా మేడ్ ఇన్ ఇండియా స్థాయి నుంచి ఇమాజిన్డ్ ఇన్ ఇండియా దిశగా సాగాలి: ఆవిష్కరణల ఆధారిత వృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపు ఈసీఈలో కల్లకుంట సునీలకు పీహెచ్.డీ. బెర్లిన్ ఎన్నికల్లో వామపక్షాల విజయం: వలసదారుల్లో చిగురించిన ఆశలు.. తీవ్ర మితవాద ఏఎఫ్‌డీ ఎదుగుదలపై కలవరం జగన్‌తో భేటీపై షర్మిల స్పష్టత: “అవన్నీ కట్టుకథలే.. పెళ్లి శుభకార్యాన్ని రాజకీయాలకు ముడిపెట్టొద్దు” ఇరాన్ అధ్యక్షుడితో పాక్ హోం మంత్రి కీలక భేటీ: అమెరికాతో ఉద్రిక్తతల వేళ సరిహద్దు భద్రతపై సమాలోచనలు ప్రభుత్వ నిర్లక్ష్యం.. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం వికారాబాద్ జిల్లాలో కలకలం రేపిన అవినీతి ఆరోపణలు.. రూ. 20 వేలు డిమాండ్ చేస్తున్నారంటూ మాజీ సర్పంచ్ ఆవేదన బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాజాబాబుకు చక్రాల కుర్చీ.. కుటుంబానికి కొత్త ఆశ వికారాబాద్ లో వినాయక మండపాలను సందర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజాబాబుకు చక్రాల కుర్చీ.. కుటుంబానికి కొత్త ఆశ

Select Suryaa Now
రాజాబాబుకు చక్రాల కుర్చీ.. కుటుంబానికి కొత్త ఆశ

 

విశాఖపట్నం, సెప్టెంబర్ 22, మేజర్ న్యూస్: మానవత్వం, సేవాభావానికి ప్రతీకగా ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అచ్చుతాపురం ఎస్‌ఈజెడ్‌ కాలనీ సమీపంలోని దిబ్బపాలెం గ్రామానికి చెందిన అండే రాజాబాబుకు చక్రాల కుర్చీని అందజేశారు. దినసరి కూలీ చిన అప్పారావు కుమారుడైన రాజాబాబు చిన్ననాటి నుంచే పోలియో కారణంగా నడవలేని పరిస్థితిలో ఉన్నారు.

రోజువారీ అవసరాలకు ఇతరులపై ఆధారపడుతున్న రాజాబాబుకు చక్రాల కుర్చీ అందడంతో ఇకపై సులభంగా కదలడానికి, కొంతవరకు స్వతంత్రంగా తన పనులు చేసుకోవడానికి అవకాశం కలగనుంది. ఏళ్లుగా కుమారుడి ఇబ్బందులను చూస్తున్న వృద్ధ తల్లిదండ్రులకు ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చింది.

ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సమితి అభ్యర్థన మేరకు చక్రాల కుర్చీని అందించేందుకు ఏఎంఈజెడ్‌ (AMTZ)లోని ఉక్కునగరం డీపీఎస్‌ పాఠశాలలో పనిచేస్తున్న టి.ఎన్. నాగిని ఆర్థిక సహకారం అందించారు. ఆమె సహకారంతో చక్రాల కుర్చీని సమకూర్చి రాజాబాబుకు అందజేశారు.

ఈ సందర్భంగా ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ డి.ఏ.వి. సన్యాసిరాజు మాట్లాడుతూ.. సేవా కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన టి.ఎన్. నాగినికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “మానవ సేవే మాధవ సేవ” అనే స్ఫూర్తితో అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడమే సమితి లక్ష్యమని పేర్కొన్నారు.

రాజాబాబుకు అందించిన చక్రాల కుర్చీ ఆయన కదలికకు మాత్రమే కాకుండా, కుటుంబంలో కొత్త ఆశను నింపిందని గ్రామస్థులు పేర్కొన్నారు. సేవా కార్యక్రమానికి సహకరించిన ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.