BREAKING
రేపు సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి రానున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -దాదాపు రూ.74.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇందిరమ్మ ఇల్లు కోసం లబ్ధిదారుల నిరీక్షణ! రూ . 2 వేల వరకు UPI చెల్లింపులపై ఛార్జీలు లేవు: స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం నిమజ్జనానికి నీటి కోసం ఆందోళన దురదృష్టకరం మెదక్ జిల్లాలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కు శ్రీకారం త్వరలో సెంట్రలైజ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధం --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నైజీరియా ఇంధన శుద్ధి విప్లవానికి గుత్తాధిపత్య సెగ: మార్కెట్ పోటీతత్వంపై తీవ్ర ఆందోళనలు అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నేటి రాత్రి వరకే ఖైరతాబాద్‌ మహా గణపతి దర్శనాలు భక్తుల దర్శనానికి ఈ ఒక్క రోజే అవకాశం నైజీరియా ఇంధన శుద్ధి విప్లవానికి గుత్తాధిపత్య సెగ: మార్కెట్ పోటీతత్వంపై తీవ్ర ఆందోళనలు ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడుల ఉధృతి: ముగ్గురు మృతి.. ఐరాస సదస్సు కోసం అమెరికాలో జెలెన్‌స్కీ అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు: దసరా ముందే పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు! నిజాంపేట భవ్యాస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో అట్టహాసంగా వినాయక చవితి వేడుకలు వినాయక నిమజ్జనానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా మేడ్ ఇన్ ఇండియా స్థాయి నుంచి ఇమాజిన్డ్ ఇన్ ఇండియా దిశగా సాగాలి: ఆవిష్కరణల ఆధారిత వృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపు

ఈసీఈలో కల్లకుంట సునీలకు పీహెచ్.డీ.

Select Suryaa Now
ఈసీఈలో కల్లకుంట సునీలకు పీహెచ్.డీ.

ఈసీఈలో కల్లకుంట సునీలకు పీహెచ్.డీ.

పటాన్ చెరు ;  గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) పరిశోధక విద్యార్థిని కల్లకుంట సునీల డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘సెంట్రాలిటీ కొలతలపై దృష్టి సారించి, గ్రాఫ్ థియరీ టెక్నిక్ లను ఉపయోగించి కీలక నోడ్ గుర్తింపు ద్వారా వైర్ లెస్ సెన్సార్ నెట్ వర్కుల ఆప్టిమైజేషన్’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఈఈసీఈ విభాగం అధ్యాపకుడు డాక్టర్ ఎ.శ్రీనివాస్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ అంతర్ విభాగ పరిశోధన, వైర్ లెస్ సెన్సార్ నెట్ వర్కుల శక్తి సామర్థ్యం, విశ్వసనీయత, స్థితిస్థాపకత, డేటా ప్రసార సామర్థ్యాలను మెరుగుపరచడానికి గ్రాఫ్ థియరీ, గణాంకాలు, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లను ఏకీకృతం చేస్తుందని వివరించారు. ఈ పరిశోధనకు పర్యావరణ పర్యవేక్షణ, ప్రెసిషన్ అగ్రికల్చర్, పారిశ్రామిక ఆటో మేషన్, ఆరోగ్య సంరక్షణ, విపత్తు నిర్వహణ, రక్షణ నిఘా వంటి రంగాలలో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయన్నారు.తన డాక్టరేట్ ప్రస్థానంలో, డాక్టర్ సునీల పది పరిశోధనా పత్రాలను ప్రచురించడమే గాక, ఐఐటీ హైదరాబాదు, బిట్స్ పిలానీ, హైదరాబాదు ప్రాంగణాలలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులలో తన పరిశోధనను సమర్పించారు.డాక్టర్ సునీల సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం నాయకత్వంతో పాటు, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందనలు తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె పరిశోధన, వృత్తిపరమైన ప్రయత్నాలలో నిరంతర విజయం సాధించాలని వారు ఆకాంక్షించినట్టు తెలిపారు.