అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం..
అన్నమయ్య జిల్లా: మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.
ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు సహాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.