బస్ డిపో పనులకు వేగం 70 శాతం పూర్తి.. దసరా నాటికి ప్రారంభానికి సన్నాహాలు
సూర్య పెద్దపల్లి ప్రతినిధి
పెద్దపల్లి బస్ డిపో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని, రాబోయే దసరా నాటికి డిపోను ప్రారంభించేలా మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.
మంగళవారం పెద్దపల్లి బస్ డిపో నిర్మాణ పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను వేగవంతం చేసి, నిర్ణీత లక్ష్యం మేరకు పూర్తి చేయాలని సూచించారు.బస్ డిపో అందుబాటులోకి వస్తే పెద్దపల్లి ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని, ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేలా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, దసరా నాటికి డిపోను ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.