andhrapradesh
వర్షాలకు నీటి మాయమైన ప్రొద్దుటూరు
- డ్రైన్స్ మీద అక్రమ కట్టడాల వలన సమస్య
ప్రొద్దుటూరు టౌన్ మేజర్ న్యూస్: ప్రొద్దుటూరు పట్టణంలో చాలా వరకు మురికి నీరు పారే కాలువలు అక్రమణకు గురికావడంతో పలు చోట్ల వర్షం నీరు పోడానికి ఆటంకం కలుగుతోంది. పట్టణంలో పలు చోట్ల మురుగు కాలవలు లో ప్లాస్టిక్ వేయడం వల్ల వర్షపు నీరు పోవడానికి ఆటంకం ఏర్పడింది. పలు ప్రాంతాలలో ఉన్న డ్రైన్స్ లో సిల్ట్ తీసేపనిలో పారిశుధ్య కార్మికులు నిమగ్నమయ్యారు. మంగళవారం ఉద్యయం 4 గంటల నుంచి కమీషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సిబ్బంది పలు ప్రాంతాలు తనిఖీలు చేసారు. వర్షపు నీరు మురికి కాలువల ద్వారా వెళ్ళేందుకు సిల్ట్ తీశారు.
మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ డ్రైన్స్ మీద అక్రమ కట్టడాలు కాటయి వ్యాపారాలు చేస్తున్న యజమానులకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.
ప్రొద్దుటూరు పట్టణంలో డ్రైన్స్ మీద ఉన్న అక్రమ కట్టడాలను, బంకులను తొలగించడానికి దశలవారీగా ప్రణాళిక సిద్ధం చేయమని టౌన్ ప్లానింగ్ అధికారులకు కమీషనర్ ఆదేశాించారు