BREAKING
నేషనల్ అవార్డ్‌ అందుకున్న సుకుమార్, నిహారిక వాడపల్లి క్షేత్రం.. భక్తజన శోభితం శ్రీశైలంలో శ్రీ కుమారస్వామికి ప్రత్యేక పూజలు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌కు రోటరీ ఐ హాస్పిటల్‌లో శిబిరం  యూనస్ హయాంలో కుదిరిన అమెరికా వాణిజ్య ఒప్పందంపై బంగ్లాదేశ్ మీడియా అసంతృప్తి: సమీక్షించాలని తాత్కాలిక ప్రభుత్వానికి విజ్ఞప్తి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి శ్రీ మఠంలో సుదర్శన హోమం ప్రతిభావంతులైన విద్యార్థినులకు నగదు పురస్కారాలు చదువులో రాణించాలి - కోటిరెడ్డి ట్రస్ట్ వారసులు.. 104 వైద్య సేవలో నిర్లక్ష్యం -ఎగువ పల్లె ప్రజలు ఆవేదన  సరికొత్త ఉడాన్ పథకానికి21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రీన్ సిగ్నల్:  విస్తరించనున్న ప్రాంతీయ విమానయాన సేవలు డ్రైనేజీ ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్ చర్యలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి. డివిజన్‌లో ఈ నెల 27న టీయూడబ్ల్యూజేఎఫ్ సమావేశం. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి వల్లూరు.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.. పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసి చేయించుకోవాలి. మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి గుజరాత్‌లో జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులకు లైన్ క్లియర్: ఎన్‌హెచ్ఏఐ, ఎస్‌ఎస్ఎన్‌ఎన్ఎల్ మధ్య కీలక ఒప్పందం

వర్షపు నీటికి అడ్డుకట్టగా అక్రమ కట్టడాలు డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపునకు చర్యలు.. కమిషనర్ ఆదేశాలు

Select Suryaa Now
వర్షపు నీటికి అడ్డుకట్టగా అక్రమ కట్టడాలు  డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపునకు చర్యలు.. కమిషనర్ ఆదేశాలు

వర్షపు నీటికి అడ్డుకట్టగా అక్రమ కట్టడాలు

డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపునకు చర్యలు.. కమిషనర్ ఆదేశాలు

ప్రొద్దుటూరు, మేజర్ న్యూస్:
భారీ వర్షాలకు ప్రొద్దుటూరు పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమవుతున్న నేపథ్యంలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పురపాలక అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా మురుగు కాలువలు ఆక్రమణకు గురికావడం, డ్రైనేజీలపై అక్రమ కట్టడాలు, బంకులు ఏర్పాటు చేయడం, కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల వర్షపు నీరు సక్రమంగా ప్రవహించక ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆధ్వర్యంలో పురపాలక సిబ్బంది పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. వర్షపు నీరు నిలిచిపోయిన ప్రాంతాలను, మురుగు కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్, ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశీలించి, వెంటనే తొలగించేలా పారిశుధ్య కార్మికులను ఆదేశించారు. డ్రైనేజీలపై అక్రమంగా నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు నిర్వహిస్తున్న యజమానులకు కమిషనర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాలువల ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేకపోతే పురపాలక శాఖ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. పట్టణంలోని డ్రైనేజీలపై ఉన్న అక్రమ కట్టడాలు, బంకులను దశలవారీగా తొలగించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని టౌన్‌ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. వర్షపు నీరు సజావుగా వెళ్లేలా కాలువల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.