నన్ను నమ్మి అభివృద్ధిని చూసి నావెంట నడవండి - ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
నన్ను నమ్మి అభివృద్ధిని చూసి నావెంట నడవండి
- ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
- నాటి పాలకుల స్వార్థం.. రూ.80 కోట్లు నిధులకు గండి
- దోచుకోవడానికే చౌదరిపాలేన్ని మున్సిపాలిటీలో విలీనం
- చౌదరిపాలేన్ని విచ్చిన్నం చేసి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు
- ఎన్నికలు జరగకుండా చేసి కావలి పట్టణ అభివృద్ధిని దెబ్బతీశారు_
కావలి, మేజర్ న్యూస్: మీరు, నేను కలిసి కావలి అభివృద్ధిలో భాగస్వాములమై అభివృద్ధి పథంలో ముందుకు పోదామని నన్ను నమ్మి, చేసిన అభివృద్ధిని చూసి నా వెంట నడవండి అని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కావలి పట్టణం దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణమండపంలో పట్టణ పురపాలక శాఖ ఆధ్వర్యంలో హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హెచ్ ఏ ఎం)పథకం ద్వారా చేపడుతున్న పనులకు ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా ఆన్ లైన్ విధానంలో 40 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గం, అర్బన్ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్న, ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా కావలి పట్టణ అభివృద్ధి కోసం తనను గెలిపించినందుకు ప్రజలకు, తనకిచ్చిన అధికారం బట్టి తనను నమ్మి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు వీరందరి సహకారంతో కావలి అభివృద్ధి కి నిధులు సమకూరుస్తూ సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కావలి పట్టణం కథ ఏడు సంవత్సరాల కాలంలో గత పాలకుల నిర్లక్ష్యానికి గురై, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడం వలన నిధులు రాకపోవడం వలన మునిసిపాలిటీకి కేంద్రం నుంచి రావలసిన 80 కోట్ల రూపాయల నిధులు రాకుండా అభివృద్ధికి వెనుకబడిందని, తద్వారా 20 సంవత్సరాలు అభివృద్ధిలో వెనుకబడిందని తెలిపారు. త్వరలో జరగబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో తాను చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించి కూటమి ప్రభుత్వం అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కావలి పట్టణంలోని 44 వార్డులలో నిలబడే తమ అభ్యర్ధులు అత్యధిక ఓట్లతో గెలిపించి, విజయం సాధించిపెట్టి, కావలి అభివృద్ధికి అందరం కలిసి పని చేసుకొందాం, కావలిని అభివృద్ధి పథంలో నడిపించుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో వేషగాళ్ళు వస్తూ, పోతూ ఉంటారని, వారు వచ్చి అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద జల్లే పనులు చేస్తారని, అలాంటి వారీని గుర్తించి ప్రజలు జాగ్రత్త వహించాలని తెలిపారు. 24 గంటలు తాను అందుబాటులో ప్రజలకు ఉంటూ, తన శరీరాన్ని, కష్టాన్ని ప్రజలకు అంకితం చేస్తూ మీకు అండగా ఉంటున్నాననన్న విషయం ప్రజలు గుర్తించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.11,359 కోట్ల పట్టణాభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టి పచ్చవల్ విధానంలో శంకుస్థాపన చేశారన్నారు.
కుప్పం నుంచి వర్చువల్‌గా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం కు ధన్యవాదములు తెలిపారు.
సందర్భంగా రూ.40కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆవిష్కరించారు.
కావలి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.కావలి కనకపట్నం దిశగా పరుగులు తీస్తోంది అని, విస్తరణే ప్రధాన ధ్యేయంగా ఉందన్నారు.10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలికి చేసిందేమీ లేదని విమర్శలు చేశారు. అభివృద్ధిని చూసి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలీ అన్నారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 44 వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కావలి అభివృద్ధికి 425 కోట్ల రూపాయలతో ఊహకు అందని నిధులు తీసుకురావడం జరిగిందని తెలిపారు. దోమలు లేని కావలిగా చేసుకుందాం అని, అందుకు ప్రజలందరూ సహకరించాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమినేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.