BREAKING
నేషనల్ అవార్డ్‌ అందుకున్న సుకుమార్, నిహారిక వాడపల్లి క్షేత్రం.. భక్తజన శోభితం శ్రీశైలంలో శ్రీ కుమారస్వామికి ప్రత్యేక పూజలు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌కు రోటరీ ఐ హాస్పిటల్‌లో శిబిరం  యూనస్ హయాంలో కుదిరిన అమెరికా వాణిజ్య ఒప్పందంపై బంగ్లాదేశ్ మీడియా అసంతృప్తి: సమీక్షించాలని తాత్కాలిక ప్రభుత్వానికి విజ్ఞప్తి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి శ్రీ మఠంలో సుదర్శన హోమం ప్రతిభావంతులైన విద్యార్థినులకు నగదు పురస్కారాలు చదువులో రాణించాలి - కోటిరెడ్డి ట్రస్ట్ వారసులు.. 104 వైద్య సేవలో నిర్లక్ష్యం -ఎగువ పల్లె ప్రజలు ఆవేదన  సరికొత్త ఉడాన్ పథకానికి21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రీన్ సిగ్నల్:  విస్తరించనున్న ప్రాంతీయ విమానయాన సేవలు డ్రైనేజీ ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్ చర్యలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి. డివిజన్‌లో ఈ నెల 27న టీయూడబ్ల్యూజేఎఫ్ సమావేశం. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి వల్లూరు.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.. పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసి చేయించుకోవాలి. మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి గుజరాత్‌లో జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులకు లైన్ క్లియర్: ఎన్‌హెచ్ఏఐ, ఎస్‌ఎస్ఎన్‌ఎన్ఎల్ మధ్య కీలక ఒప్పందం

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కలెక్టర్ హిమాన్షు శుక్ల

Select Suryaa Now
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కలెక్టర్ హిమాన్షు శుక్ల

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కలెక్టర్ హిమాన్షు శుక్ల

➖ పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం

వరికుంటపాడు, మేజర్ న్యూస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ఉదయగిరి నియోజకవర్గ పర్యటన ఈనెల 29న ఖరారయ్యే అవకాశం ఉన్నందున  ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. 
ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో నిర్వహించనున్న జీ రామ్ జీ పల్లెపండుగ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులతో కలిసి పరిశీలించారు.
రామాపురంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటనకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.
వివిధ శాఖలకు అప్పగించిన బాధ్యతలు, ఏర్పాట్ల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఎమ్మెల్యే, కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఏఎస్పి దీక్ష, ఆర్డీవో పావని, డీఎస్పీలు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.