ఒజోన్ పొరను పరిరక్షించుకోవాలి
విశాఖపట్నం, సెప్టెంబర్ 22, మేజర్ న్యూస్ : ఒజోన్ పొర నాశనం అయితే అతినీలలోహిత కిరణాలు భూమిని తాకి జీవరాశుల ఉనికిని నష్ఠపరుస్తాయన్నారు మాంట్రియల్ ఒప్పందాన్ని గౌరవిస్తూ భవిష్యతరాలకు ఆరోగ్యకర వాతావరణాన్ని అందించడానికి ప్రజలు, ప్రభుత్వాలు అవగాహనతో ముందుకు సాగాలని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ డైరక్టర్ ప్రొఫెసర్ చందు కవిత పిలుపునిచ్చారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పర్యావరణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఓజోన్ పరిరక్షణ పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శీతల యంత్రాల కారణంగా ఓజోన్ పొర దెబ్బతిని మానవ మనుగడ ప్రమాదంలో పడుతోందన్నారు. వీటికి ప్రత్యామ్నాయ పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గీతం జీవ శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ నీరజ్‌మిశ్ర, కార్యక్రమం కోఆర్డినేటర్ డాక్టర్ కె.సూరేష్ కుమార్ తమ ప్రసంగాలలో ఓజోన్ పొరను దెబ్బతీసే కాలుష్య కారకాల నియంత్రణకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కృషిని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ సరిత, డాక్టర్ ఆర్.కిరణ్మయి, డాక్టర్ హరీష్ ప్రకాష్, డాక్టర్ ఆదర్శ్ కుమార్, డాక్టర్ కె.మదన్‌శేఖర్ నిర్వహకులుగాను, పరిశోధకులు, విద్యార్ధులు పెద్దఎత్తున పాల్గోన్నారు.ఈ సందర్భంగా నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన ఆఖరి సంవత్సరం యుజి, పిజి విద్యార్ధులకు వ్యాసరూప పోటీలు, నాటికలు, క్విజ్ పోటీలు మరియు ట్రెజర్ హంట్ వంటి వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.