BREAKING
నేషనల్ అవార్డ్‌ అందుకున్న సుకుమార్, నిహారిక వాడపల్లి క్షేత్రం.. భక్తజన శోభితం శ్రీశైలంలో శ్రీ కుమారస్వామికి ప్రత్యేక పూజలు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌కు రోటరీ ఐ హాస్పిటల్‌లో శిబిరం  యూనస్ హయాంలో కుదిరిన అమెరికా వాణిజ్య ఒప్పందంపై బంగ్లాదేశ్ మీడియా అసంతృప్తి: సమీక్షించాలని తాత్కాలిక ప్రభుత్వానికి విజ్ఞప్తి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి శ్రీ మఠంలో సుదర్శన హోమం ప్రతిభావంతులైన విద్యార్థినులకు నగదు పురస్కారాలు చదువులో రాణించాలి - కోటిరెడ్డి ట్రస్ట్ వారసులు.. 104 వైద్య సేవలో నిర్లక్ష్యం -ఎగువ పల్లె ప్రజలు ఆవేదన  సరికొత్త ఉడాన్ పథకానికి21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రీన్ సిగ్నల్:  విస్తరించనున్న ప్రాంతీయ విమానయాన సేవలు డ్రైనేజీ ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్ చర్యలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి. డివిజన్‌లో ఈ నెల 27న టీయూడబ్ల్యూజేఎఫ్ సమావేశం. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి వల్లూరు.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.. పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసి చేయించుకోవాలి. మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి గుజరాత్‌లో జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులకు లైన్ క్లియర్: ఎన్‌హెచ్ఏఐ, ఎస్‌ఎస్ఎన్‌ఎన్ఎల్ మధ్య కీలక ఒప్పందం

నెల్లూరు జిల్లాలో మౌలిక వసతుల సువర్ణాధ్యాయం - ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన

Select Suryaa Now
నెల్లూరు జిల్లాలో మౌలిక వసతుల సువర్ణాధ్యాయం -                                            ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి చేతుల మీదుగా  పనులకు శంకుస్థాపన

నెల్లూరు జిల్లాలో మౌలిక వసతుల సువర్ణాధ్యాయం
-                                            ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి చేతుల మీదుగా  పనులకు శంకుస్థాపన
* నెల్లూరు కార్పొరేషన్‌లో 240 కోట్లతో 24 అభివృద్ధి పనులు
* కుప్పం నుంచి సీఎంచంద్రబాబు , విశాఖ నుంచి మంత్రి నారాయణ గారు వర్చువల్ సందేశం
* హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పథకం కింద జిల్లావ్యాప్తంగా 62 అభివృద్ధి పనులకు శ్రీకారం

నెల్లూరు,  మేజర్ న్యూస్: నెల్లూరు జిల్లా చరిత్రలోనే మరపురాని విధంగా మైపాడు గేట్ సెంటర్‌లోని డిజిపి కళ్యాణ మండపంలో నగరపాలక సంస్థ మరియు మున్సిపాలిటీల పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. సభారంభంలో వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు మరియు నాయకులు ముందుగా దివ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా ప్రారంభించగా, ఈ శంకుస్థాపన మహోత్సవంలోనే నగరాభివృద్ధికి సంబంధించిన శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించి ప్రారంభించారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్  పథకం ద్వారా జిల్లావ్యాప్తంగా 380 కోట్ల అంచనా వ్యయంతో 62 అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగ్గా, అందులో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మంజూరైన 240 కోట్ల భారీ బడ్జెట్ విలువైన 24 అభివృద్ధి పనులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేయర్ సుజాత, మరియు కార్పొరేషన్ కమిషనర్ నందన్  ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో పట్టణ ప్రాంతాల్లో రహదారులు, సెంట్రల్ మీడియన్స్, సెంట్రల్ లైటింగ్, పార్కులు తదితర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. ఇక జిల్లాలోని కావలి మున్సిపాలిటీ పరిధిలో 8 పనులకు 40 కోట్లు, గూడూరు మున్సిపాలిటీలో 12 పనులకు  30 కోట్లు, ఆత్మకూరు మున్సిపాలిటీలో 6 పనులకు 29 కోట్లు, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 5 పనులకు  22 కోట్లు, అల్లూరు నగర పంచాయతీ పరిధిలో 7 పనులకు 19 కోట్లు చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఈ చారిత్రాత్మక ఘట్టం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 8,000 కోట్ల హామ్ పనులకు కుప్పం నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసి సందేశమివ్వగా, విశాఖపట్నం నుంచి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ  ప్రత్యేకంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కృషి వల్లే ఈ నిధుల మంజూరు సాధ్యమైందని, జిల్లాను సర్వతోముఖాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు..అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీ మరియు ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 872 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ విజయోత్సాహంతో  టీడీపీ నాయకులు, శ్రేణులు మరియు కార్యకర్తల అపూర్వ జనసందోహంతో డిజిపి కళ్యాణ మండపం ప్రాంగణమంతా కిక్కిరిసిపోయి శంకుస్థాపన వేడుక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ అభివృద్ధి వేడుకలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్ళపాక అనూరాధ, మాజీ జడ్పిటిసి విజేతా రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు మామిడాల మధు, మరియు రాష్ట్ర వేర్‌హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు తదితర ప్రముఖ నేతలందరూ విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని మహోజ్వలంగా విజయవంతం చేశారు.