BREAKING
యుద్ధ సంక్షోభాల నడుమ ఐరాస సర్వసభ్య సమావేశాలు: వేదికపై గళమెత్తనున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, జెలెన్‌స్కీ ‘మండాడి’ మూవీ టీమ్‌ను అభినందించిన లోకనాయకుడు కమల్ హాసన్.. వంద కోట్ల క్లబ్‌లో జోరు! UFBU పిలుపునిచ్చిన సమ్మె దృష్ట్యా, బ్యాంకులు ఆదివారం తెరిచి ఉంటాయా? శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ మూవీ హీరోయిన్‌గా మానస వారణాసి.. రేపే ఫస్ట్ బూస్టర్ అప్‌డేట్! నకిలీ ఐడీ కార్డులతో ‘ఉక్కు’లో చోరీలు రాజకీయాల్లోకి అజిత్ ఎంట్రీ?.. పార్టీ పేరు, జెండాతో ఫ్యాన్స్ హడావుడి! ఐరాస సర్వసభ్య సమావేశాల్లో నేడు కీలక ప్రసంగాలు: అంతర్జాతీయ వేదికపై గళమెత్తనున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, జెలెన్‌స్కీ సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ ల పరిశీలన భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జుల నియామకం.. అనిల్ బలూనికి కీలక బాధ్యతలు పాఠశాలల్లో శానిటరీ న్యాప్‌కిన్ల పంపిణీపై సుప్రీంకోర్టు ఆగ్రహం: వివరణ ఇవ్వని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు షోకాజ్ నోటీసులు జాతీయ అవార్డును అమ్మ మెడలో వేసి భావోద్వేగం.. కోలీవుడ్ స్టార్ ధనుష్ ట్రెండింగ్ పోస్ట్! అనంతగిరి ఘాట్ రోడ్ లో విరిగిపడ్డ కొండ చెరియలు శశి థరూర్–మధుయాష్కీ గౌడ్ భేటీ ఎఐపిసి విస్తరణకు కార్యాచరణ రూపకల్పన సేవా రంగంలో అగ్రగామిగా నిలుస్తుంది - మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ పాకిస్తాన్‌లో ఘోర వైద్య నిర్లక్ష్యం: సాధారణ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తే డజన్ల కొద్దీ చిన్నారులకు హెచ్ఐవీ, న్యాయం కోసం బాధితుల పోరాటం

రాబోయే ఆరు నెలల్లో రూ.90 కోట్లతో ఆత్మకూరులో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం: మంత్రి ఆనం

Select Suryaa Now
రాబోయే ఆరు నెలల్లో రూ.90 కోట్లతో ఆత్మకూరులో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం: మంత్రి ఆనం


రాబోయే ఆరు నెలల్లో రూ.90 కోట్లతో ఆత్మకూరులో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం: మంత్రి ఆనం
➖ ఆత్మకూరు మున్సిపాలిటీని నెంబర్ వన్ గా  తీర్చిదిద్దడమే లక్ష్యమన్న మంత్రి ఆనం

ఆత్మకూరు,మేజర్ న్యూస్:: ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో ఆత్మకూరు మున్సిపాలిటీలో చేపట్టనున్న రూ.29 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 123 మున్సిపాలిటీల పరిధిలో రూ.11,359 కోట్ల విలువైన పనులకు సీఎం ఏకకాలంలో శ్రీకారం చుట్టారు.

ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయం నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్చువల్ శంకుస్థాపన అనంతరం ఆత్మకూరులో చేపట్టనున్న రూ.29 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలకాన్ని మంత్రి ఆనం ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపట్టనున్న రూ.29 కోట్ల పనులతో ఆత్మకూరు మున్సిపాలిటీకి మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. మంజూరైన నిధుల్లో ప్రాధాన్యత క్రమంలో రూ.27 కోట్లను సిమెంట్ రోడ్ల నిర్మాణానికి వినియోగించనున్నట్లు చెప్పారు.

ఆత్మకూరు పట్టణ డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అదనంగా రూ.12 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. అమృత్-2 పథకం కింద ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయి కనెక్షన్ అందించడంతో పాటు, రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణానికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు.

పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.6.5 కోట్లతో చేపట్టిన నాలుగు లైన్ల బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయిందని, త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు నాగులపాడు జంక్షన్ వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

గత ఐదేళ్లలో ఆత్మకూరు అభివృద్ధికి రూ.21 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని మంత్రి ఆనం విమర్శించారు. విద్యుత్ బకాయిలు, ప్రచార కార్యక్రమాలకే గత ప్రభుత్వం నిధులను వినియోగించిందని ఆరోపించారు. రూ.6 కోట్లకు పైగా ఖర్చు చేసిన జగనన్న కాలనీల్లో ప్రస్తుతం కేవలం 94 మంది మాత్రమే నివసిస్తున్నారని పేర్కొన్నారు.

రాబోయే ఆరు నెలల్లో ఆత్మకూరు మున్సిపాలిటీలో రూ.90 కోట్ల విలువైన అభివృద్ధి పనులను పూర్తి చేసి పట్టణాన్ని గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.