BREAKING
న్యూయార్క్ చర్చల్లో ఇరాన్ కీలక షరతులు: షిప్పింగ్ దిగ్బంధం ఎత్తివేత, ఆస్తుల విడుదలపైనే దౌత్యపరమైన ముందడుగు పులివెందులలో బీటెక్ రవి సమక్షంలో టిడిపిలో చేరిన 50 కుటుంబాలు అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తా వర్షాకాలంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలి పులివెందుల మున్సిపల్ కమిషనర్ తనూజ కేంద్ర ఎన్నికల సంఘం నియామకాల చట్టంపై సుప్రీంకోర్టు భిన్న తీర్పు: విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు బుడమేరు లాంటి వెల్లటూరు..... స్పందించండి మహాప్రభో. డీజే టిల్లు రేంజ్‌లో వస్తోన్న ‘అనుమాన పక్షి’.. 100 శాతం బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ అంటున్న డైరెక్టర్ విమల్ కృష్ణ! యుద్ధ సంక్షోభాల నడుమ ఐరాస సర్వసభ్య సమావేశాలు: వేదికపై గళమెత్తనున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, జెలెన్‌స్కీ ‘మండాడి’ మూవీ టీమ్‌ను అభినందించిన లోకనాయకుడు కమల్ హాసన్.. వంద కోట్ల క్లబ్‌లో జోరు! UFBU పిలుపునిచ్చిన సమ్మె దృష్ట్యా, బ్యాంకులు ఆదివారం తెరిచి ఉంటాయా? శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ మూవీ హీరోయిన్‌గా మానస వారణాసి.. రేపే ఫస్ట్ బూస్టర్ అప్‌డేట్! నకిలీ ఐడీ కార్డులతో ‘ఉక్కు’లో చోరీలు రాజకీయాల్లోకి అజిత్ ఎంట్రీ?.. పార్టీ పేరు, జెండాతో ఫ్యాన్స్ హడావుడి! ఐరాస సర్వసభ్య సమావేశాల్లో నేడు కీలక ప్రసంగాలు: అంతర్జాతీయ వేదికపై గళమెత్తనున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, జెలెన్‌స్కీ సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ ల పరిశీలన

‘మండాడి’ మూవీ టీమ్‌ను అభినందించిన లోకనాయకుడు కమల్ హాసన్.. వంద కోట్ల క్లబ్‌లో జోరు!

Select Suryaa Now
‘మండాడి’ మూవీ టీమ్‌ను అభినందించిన లోకనాయకుడు కమల్ హాసన్.. వంద కోట్ల క్లబ్‌లో జోరు!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సుహాస్ మరియు సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన చిత్రం ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ వంద కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అద్భుతమైన ఆదరణ లభించింది. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమా బృందాన్ని ప్రత్యేకంగా అభినందించగా, తాజాగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ స్వయంగా ‘మండాడి’ టీమ్‌ను అభినందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించిన కమల్ హాసన్, దర్శకుడు, నిర్మాతతో పాటు సూరి, సుహాస్, రవీంద్ర విజయ్ తదితరులతో వ్యక్తిగతంగా ముచ్చటించి సినిమాలోని ప్రతిభను కొనియాడారు. ఈ అరుదైన అనుభూతి తన జీవితంలో ఎప్పటికీ మరువలేనిదని, కమల్ హాసన్ సర్ కురిపించిన ప్రేమ తమకు ఎంతో ప్రత్యేమని నటుడు సూరి సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. లెజెండరీ నటుడి నుంచి వచ్చిన ఈ ప్రశంసలు సినిమా స్థాయిని మరింత పెంచడంతో పాటు చిత్ర బృందానికి కొండంత బలాన్నిచ్చాయని చెప్పవచ్చు.

సినిమాలోని బోట్ సీక్వెన్స్, రేసింగ్ దృశ్యాలు ప్రేక్షకులను థ్రిల్ చేయగా, కథిర్ సినిమాటోగ్రఫీ మరియు జీవీ ప్రకాష్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని పంచాయి. సూరి మరియు సుహాస్ అద్భుతమైన నటనతో పాటు బలమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.