BREAKING
తనకున్న మానసిక రుగ్మతపై స్పందించిన హీరో అశోక్ సెల్వన్.. భార్యకు పెట్టిన కండిషన్ అదే! నన్ను నమ్మి అభివృద్ధిని చూసి నావెంట నడవండి - ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వర్షాలకు నీటి మాయమైన ప్రొద్దుటూరు నేడు వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకి అంతరాయం: మండల విద్యుత్ అధికారి నరేందర్ రెడ్డి మునుగోడు,మేజర్ న్యూస్: నిమ్స్‌ అధికారి లక్ష్మీభాస్కర్‌ ఆస్తులపై ఏసీబీ సోదాలు సంగాపూర్ గ్రామ అభివృద్ధికి కృషి : సర్పంచ్ మమత వెంకటరెడ్డి సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా 'మిస్ కాళికా మిస్సింగ్'.. అక్టోబర్‌లో విడుదలకు ముస్తాబు! కర్ణాటకలో లోకాయుక్త మెరుపు దాడులు: భారీగా నగదు, బంగారం, 80 మద్యం బాటిళ్లు పట్టివేత.. అధికారుల అక్రమాస్తులు బట్టబయలు వర్షపు నీటికి అడ్డుకట్టగా అక్రమ కట్టడాలు డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపునకు చర్యలు.. కమిషనర్ ఆదేశాలు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాల కిష్టారెడ్డి. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కలెక్టర్ హిమాన్షు శుక్ల రాజమండ్రి రూ. 2 కోట్ల నగదు మాయం కేసులో కీలక మలుపు విశాఖలో డ్రైవర్ సాయిశివ అరెస్ట్.. రూ.1.61 కోట్లు రికవరీ గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నెల్లూరు జిల్లాలో మౌలిక వసతుల సువర్ణాధ్యాయం - ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చర్చలతోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం. ఏపీ ఎన్జీవోస్

స్వాధీనం చేసుకున్న 2,400 ఎకరాల వివరాలు ఏవి?

Select Suryaa Now
స్వాధీనం చేసుకున్న 2,400 ఎకరాల వివరాలు ఏవి?

స్వాధీనం చేసుకున్న 2,400 ఎకరాల వివరాలు ఏవి?

– ముఖ్యమంత్రి ప్రకటనపై శ్వేతపత్రం విడుదల చేయాలి

– ఆధారాలు చూపకపోతే క్షమాపణ చెప్పాలి.

-బీఆర్‌ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్

సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి 

 రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, అందులో 2,400 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వాస్తవాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. స్థానిక తెలంగాణ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు.

​ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటే.. ఆ భూములకు సంబంధించిన గ్రామాలు, సర్వే నంబర్లు, ఎవరి చేతుల్లోకి వెళ్లాయి, ఎక్కడెక్కడ ఎంత స్వాధీనం చేసుకున్నారో పూర్తి వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. సిరిసిల్ల పర్యటనకు వచ్చేలోపే ఈ వివరాలను బహిర్గతం చేయాలని, లేనిపక్షంలో ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరిస్తున్నామని, అవసరమైతే న్యాయపోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

​ఈ సమావేశంలో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ, ఉపాధ్యక్షుడు దార్ల సందీప్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, విద్యుత్ సహకార సంస్థ అధ్యక్షుడు చిక్కాల రామరావు, నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, కుంబాల మల్లారెడ్డి, బొల్లి రామ్మోహన్, గుండ్లపల్లి పూర్ణచందర్, చంద్రయ్య, రాజు, స్వాతి, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.