వినాయక వేడుకల్లో తీవ్ర విషాదం…విద్యుత్ షాక్ తో యువకుడి మృతి
సూర్య పెగడపల్లి
ప్రతి సంవత్సరం లాగానే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్న యువకుడు అదే గణేష్ మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి మరణించిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది . జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలం లోని బతికేపల్లి గ్రామానికి చెందిన గడ్డం మధు అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద సోమవారం రాత్రి లైట్ ను సరిచేసే క్రమంలో అక్కడే ఉన్న కరెంట్ వైర్ తగిలి కింద పడిపోగా గమనించిన స్నేహితులు యువకుడిని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మధు మృతి చెందాడని డాక్టర్లు ధృవీకరించినట్లు తెలిపారు. మధు కరీంనగర్ లోని ఎస్సారార్ కాలేజీ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడని మృతుడి సోదరుడు గడ్డం మహేష్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పెంచి పెద్ద చేసిన పెద్దమ్మ...
మధు తండ్రి లింగయ్య మూడు సంవత్సరాల వయస్సులో మరణించగా తల్లి తొమ్మిది సంవత్సరాల క్రితం మరణించింది. అప్పటి నుండి మధు తో పాటుగా తన అన్న ను తన పెద్దమ్మ నే కష్టపడి పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివిస్తుంది. అందరితో కలివిడిగా నవ్వుతూ ఉండే మధు ఆకస్మిక మరణం తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.