త్వరలో సెంట్రలైజ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధం --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
త్వరలో సెంట్రలైజ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధం
--జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
ముఖ్యమంత్రి అల్పాహారం పథకం ద్వారా మెదక్ ,సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు అల్పాహారం అందించే సెంట్రాలైజ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు.మంగళవారం మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో తెలంగాణ ప్రభుత్వం ,హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెంట్రలైడు కిచెన్ ను పరిశీలించారు.కిచన్ సామాగ్రి, కిచెన్ యంత్రాలను పరిశీలించారు.కిచన్ యంత్రాల సామాగ్రి సామర్ధ్యాన్ని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. త్వరలో గౌరవ జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా సెంట్రలైజ్ కిచెన్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయిందన్నారు.ముఖ్యమంత్రి అల్పాహారం పథకం ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వర్తిస్తుందని, దీని ద్వారా పాఠశాలలో నాణ్యమైన చదువు తో పాటు పౌష్టికమైన అల్పహారం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 395 పాఠశాలలోని,30 వేల మంది విద్యార్థులకు వర్తిస్తుందన్నారు.ఈ పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయని, త ద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో డి ఈ వో రాజు, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు,మెదక్ కిచెన్ ప్లాంట్ మేనేజర్ పునీత్ త్రిపాఠి , హెచ్
కె ఎం ట్రస్ట్ ఆర్గనైజర్ వీర ,డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ నవీన్ ,జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం బ్రేక్ ఫాస్ట్ ఇన్చార్జ్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.