BREAKING
నెల్లూరు జిల్లాలో మౌలిక వసతుల సువర్ణాధ్యాయం - ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చర్చలతోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం. ఏపీ ఎన్జీవోస్ గణనాథునికి 118 రకముల వంటకాలతో మహా నైవేద్యం సమర్పణ కృతి శెట్టి బర్త్‌డే స్పెషల్.. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్! రాబోయే ఆరు నెలల్లో రూ.90 కోట్లతో ఆత్మకూరులో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం: మంత్రి ఆనం వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలికలపై అఘాయిత్యం కలకలం.. రాజీ పేరుతో కేసు నీరుగారుస్తున్న ఎస్సై సైప్రస్‌లో మూడేళ్ల కుమారుడిమృతి కేసు: నిర్లక్ష్యానికి కారణమైనట్లు అంగీకరించిన బ్రిటిష్ తండ్రి యూపీఐ చెల్లింపుల ఛార్జీలపై జీఎస్‌టీ భయం వద్దు.. స్పష్టతనిచ్చిన ఎన్‌పీసీఐ! గోదావరి నదీ గర్భంలో అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం.. పట్టిసీమ శ్రీ వీరభద్ర స్వామి ఆలయ విశిష్టత! ఎర్రగుడి పల్లె నాగలకట్ట ప్రాంతాల్లో యు జి డి తాగునీటి సమస్యలకు పరిష్కారం వైయస్ మనోహర్ రెడ్డి ఎన్నికల వేళ వేషధారులు వస్తారు.. పోతారు.. ప్రజలు గమనించాలన్న - ఎమ్మెల్యేకావ్య కృష్ణారెడ్డి పాకిస్తాన్‌ కొహాట్‌ ఆత్మాహుతి దాడిలో విస్ఫోటం: 869 కిలోల పేలుడు పదార్థాలు వాడినట్లు బాంబ్ డిస్పోజల్ యూనిట్ వెల్లడి 'వందేమాతరం' పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు! అమెరికాతో వివాదానికి తెరపడిన వేళ గ్రీన్‌లాండ్‌ జాతీయ పతాకం ప్రత్యేకతలివే: మంచు గడ్డపై అస్తమించని సూర్యుడి చిహ్నం రిమ్స్‌ అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ...రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు

Select Suryaa Now
భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు

 

 

ప్రధాన నిందితుడు సహా ముగ్గురు అరెస్ట్ – ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలింపు

06 సూర్య కరీంనగర్ ప్రతినిధి:


కరీంనగర్‌లో భారీ స్థాయిలో జరిగిన పెట్టుబడి మోసం కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. Shreya Infra and Marketing Private Limited పేరుతో నిర్వహించిన పెట్టుబడి పథకాల ద్వారా ప్రజలను ఆకర్షించి కోట్లాది రూపాయలు సేకరించి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్ రాయ్తో పాటు రాజేష్ కుమార్, బ్రిజేష్ కుమార్ మిశ్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు.2020లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో స్థాపించిన ఈ సంస్థ ద్వారా వివిధ పెట్టుబడి పథకాలను ప్రవేశపెట్టి తక్కువ కాలంలో పెట్టుబడులకు రెండింతలు, మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికినట్లు విచారణలో వెల్లడైంది. నెట్‌వర్క్ చైన్ విధానంలో కొత్త పెట్టుబడిదారుల నుంచి సేకరించిన మొత్తాలతో పాత పెట్టుబడిదారులకు చెల్లింపులు చేస్తూ మరింత మందిని పెట్టుబడులకు ఆకర్షించినట్లు పోలీసులు తెలిపారు.కరీంనగర్ జిల్లా సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించి పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించారు. కొంతకాలం చెల్లింపులు చేసిన అనంతరం మే 2024 నుంచి చెల్లింపులు నిలిపివేసి పెట్టుబడిదారులను మోసం చేసినట్లు విచారణలో తేలింది.ఈ వ్యవహారంపై బాధితుడు గుగులోత్ శివరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ I టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, సీపీ ఆదేశాల మేరకు కేసును CCS కరీంనగర్‌కు బదిలీ చేశారు.CCS కరీంనగర్ ఇన్‌స్పెక్టర్ ఆర్. ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి, 18-09-2026 రాత్రి లక్నోలోని నిందితుల నివాసంలో హేమంత్ కుమార్ రాయ్, రాజేష్ కుమార్, బ్రిజేష్ కుమార్ మిశ్రాలను అదుపులోకి తీసుకుంది. నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను లక్నోలోని గౌరవనీయ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించారు.కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన CCS ఇన్‌స్పెక్టర్ ఆర్. ప్రకాశ్ గౌడ్, SI డి. మహిపాల్ రెడ్డి మరియు సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు.ఈ మోసానికి గురైన బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా CCS కరీంనగర్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.