BREAKING
నేషనల్ అవార్డ్‌ అందుకున్న సుకుమార్, నిహారిక వాడపల్లి క్షేత్రం.. భక్తజన శోభితం శ్రీశైలంలో శ్రీ కుమారస్వామికి ప్రత్యేక పూజలు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌కు రోటరీ ఐ హాస్పిటల్‌లో శిబిరం  యూనస్ హయాంలో కుదిరిన అమెరికా వాణిజ్య ఒప్పందంపై బంగ్లాదేశ్ మీడియా అసంతృప్తి: సమీక్షించాలని తాత్కాలిక ప్రభుత్వానికి విజ్ఞప్తి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి శ్రీ మఠంలో సుదర్శన హోమం ప్రతిభావంతులైన విద్యార్థినులకు నగదు పురస్కారాలు చదువులో రాణించాలి - కోటిరెడ్డి ట్రస్ట్ వారసులు.. 104 వైద్య సేవలో నిర్లక్ష్యం -ఎగువ పల్లె ప్రజలు ఆవేదన  సరికొత్త ఉడాన్ పథకానికి21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రీన్ సిగ్నల్:  విస్తరించనున్న ప్రాంతీయ విమానయాన సేవలు డ్రైనేజీ ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్ చర్యలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి. డివిజన్‌లో ఈ నెల 27న టీయూడబ్ల్యూజేఎఫ్ సమావేశం. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి వల్లూరు.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.. పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసి చేయించుకోవాలి. మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి గుజరాత్‌లో జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులకు లైన్ క్లియర్: ఎన్‌హెచ్ఏఐ, ఎస్‌ఎస్ఎన్‌ఎన్ఎల్ మధ్య కీలక ఒప్పందం

ఎర్రగుడి పల్లె నాగలకట్ట ప్రాంతాల్లో యు జి డి తాగునీటి సమస్యలకు పరిష్కారం వైయస్ మనోహర్ రెడ్డి

Select Suryaa Now
ఎర్రగుడి పల్లె నాగలకట్ట ప్రాంతాల్లో యు జి డి తాగునీటి సమస్యలకు పరిష్కారం వైయస్ మనోహర్ రెడ్డి

యర్రగుడిపల్లి, నాగులకట్ట ప్రాంతాల్లో యూజీడీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు
వైఎస్ మనోహర్ రెడ్డి

పులివెందుల మేజర్ న్యూస్:

పులివెందుల పట్టణంలోని యర్రగుడిపల్లి, నాగులకట్ట తదితర వీధుల్లో నెలకొన్న యూజీడీ  తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపడతామని వైఎస్ మనోహర్ రెడ్డి తెలిపారు.
ఇటీవల కురిసిన వర్షాలకు శ్రీనివాస హాల్ వెనుక వైపు ఉన్న కాలనీలోని కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో, వైఎస్ మనోహర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వర్షపు నీరు నిలిచిపోకుండా, భవిష్యత్‌లో ఇళ్లలోకి నీరు చేరకుండా డ్రైనేజీ, యూజీడీ వ్యవస్థను పరిశీలించి అవసరమైన శాశ్వత చర్యలు చేపట్టేందుకు మున్సిపల్ అధికారులతో సమన్వయం చేస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని వైఎస్ మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు హాల్ గంగాధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్, వైస్ చైర్మన్ హఫీజ్, మాజీ కౌన్సిలర్ పురుషోత్తం, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు చంద్రమౌళి, వైసీపీ నాయకులు కొల్ల భాస్కర్, సాలవేముల బాబు తదితరులు పాల్గొన్నారు.