రేపు సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి రానున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -దాదాపు రూ.74.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
తిరుమలగిరి మేజర్ న్యూస్ :- తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం సూర్యాపేట జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తుంగతుర్తి , హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో మొత్తం రూ.74.50 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.మంత్రి పర్యటన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి:ఉదయం 7:45 గంటలకు: హైదరాబాద్ నుంచి హెలికాప్టర్/విమానంలో బయలుదేరుతారు.ఉదయం 8:15 గంటలకు: తిరుమలగిరి మండలానికి చేరుకుంటారు. మంత్రి స్వగ్రామమైన తాటిపాములలో రూ.7 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పాఠశాలల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. బిక్కెరు వాగు వద్ద: రూ.16 కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్, బ్రిడ్జి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలంలోని ఎమ్మెల్యే మందుల సామెల్ స్వగ్రామం ధర్మారం గ్రామంలో రూ.32 కోట్ల వ్యయంతో పూర్తయిన చెక్ డ్యామ్‌లను మంత్రి ప్రారంభించి, ప్రజలకు అంకితం చేస్తారు.గరిడేపల్లిలో: రూ.19.50 కోట్ల నిధులతో చేపట్టనున్న ప్రధాన రహదారి విస్తరణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.