BREAKING
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ ఇంట తీవ్ర విషాదం.. తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత! ఆదిలాబాద్ రిమ్స్ లో అగ్నిప్రమాదం…ముగ్గురు శిశువుల మృతి మహారాష్ట్ర యూసీసీ కమిటీ నుంచి మాజీ న్యాయమూర్తి ఆర్సీ చవాన్ రాజీనామా: ప్రజాభిప్రాయ సేకరణ తీరుపై తీవ్ర అభ్యంతరం రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యులుగా సిపి రమేష్ బస్‌ డిపో పనులకు వేగం 70 శాతం పూర్తి.. దసరా నాటికి ప్రారంభానికి సన్నాహాలు 'మీకో దండం.. నా కాళ్లపై పడొద్దు'.. అభిమాని ప్రవర్తనపై డైరెక్టర్ అనిల్ రావిపూడి అసహనం! స్వాధీనం చేసుకున్న 2,400 ఎకరాల వివరాలు ఏవి? బస్‌ డిపో పనులకు వేగం 70 శాతం పూర్తి.. దసరా నాటికి ప్రారంభానికి సన్నాహాలు వినాయక వేడుకల్లో తీవ్ర విషాదం…విద్యుత్ షాక్ తో యువకుడి మృతి వర్షపు నీటికి కడ్డుకట్టగా అక్రమ కట్టడాలు ఒజోన్ పొరను పరిరక్షించుకోవాలి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కొత్త ట్రెండ్.. 'మైసా' యాక్షన్ అవతార్‌తో రష్మిక మందన్న సంచలనం! మండల పరిషత్తు పాలకవర్గానికి నేటితో ముగింపు కడపకు 98 కోట్ల నిధులు మంజూరు ఐదేళ్లలో ఎన్నో సాధించాం.. ప్ర‌జా సేవ‌లో అంకితభావంతో పని చేశాం

నేటి రాత్రి వరకే ఖైరతాబాద్‌ మహా గణపతి దర్శనాలు భక్తుల దర్శనానికి ఈ ఒక్క రోజే అవకాశం

Select Suryaa Now
నేటి రాత్రి వరకే ఖైరతాబాద్‌ మహా గణపతి దర్శనాలు భక్తుల దర్శనానికి ఈ ఒక్క రోజే అవకాశం

తెలంగాణ బ్యూరో ప్రతినిధి : హైదరాబాద్‌ మహా నగరంలోని ఖైరతాబాద్‌ మహా గణపతితో పాటు దాదాపు వినాయకుల సామూహిక నిమజ్జనం ఈ నెల 25న (శుక్రవారం) జరగనుంది. మహా గణపతిని ఆ రోజు ఉదయాన్నే శోభాయాత్రగా తరలించి మధ్యాహ్నం నిమజ్జనం చేసే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారు. అందుకోసం ఖైరతాబాద్‌లో ఈ నెల 23వ తేదీ (బుధవారం) రాత్రి వరకే భక్తుల దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. 24న షెడ్డు తొలగింపు, బారికేడ్ల తొలగింపు ప్రక్రియ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.


ఖైరతాబాద్ మహా గణపతిని శోభాయాత్రగా తీసుకెళ్లేందుకు గురువారం ఉదయం నుంచే వివిధ ఏర్పాట్లు చేయనున్నారు. 25న మొదట ఉదయం 6 గంటలకు వాహనాన్ని కదిలించి, మధ్యాహ్నం 12 గంటల వరకు శోభాయాత్ర, నిమజ్జనం పూర్తి చేయాలని గణేశ్‌ ఉత్సవ కమిటీ ప్రతినిధులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. మహా గణపతిని దర్శించుకునేందుకు సకుటుంబ పరివారంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నేడు కూడా రద్దీ తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు బందోబస్తును భారీగా పెంచారు.

ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ట్యాంక్ బండ్ వద్దే నిమజ్జనాలు చేస్తాం : ఉత్సవ సమితి ప్రతినిధులు

హైదరాబాద్​లో నిమజ్జనోత్సవం ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడు కార్పొరేషన్ల (జీహెచ్​ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో ఇప్పటి వరకు లక్ష విగ్రహాలు గంగమ్మ తల్లి ఒడికి చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 25న జరగనున్న పదకొండో రోజు నిమజ్జన వేడుక కోసం హైదరాబాద్​ నగరమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆ రోజు కోసం జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాట్లను ప్రారంభించాయి. ప్రధాన చెరువుల వద్ద క్రేన్ల సంఖ్యను మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో మరో 20 క్రేన్లను ఏర్పాటు చేయాలని తాజాగా అధికారులు నిర్ణయించారు. భాగ్యనగరం నలుమూలల నుంచి హుస్సేన్​ సాగర్‌కు 80 వేల విగ్రహాలు నిమజ్జనానికి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ట్యాంక్ బండ్ వద్ద గణేశ్‌ నిమజ్జనాలను నిషేధిస్తూ బారికేడ్లతో పాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై భాగ్యనగర్ గణేశ్​ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ట్యాంక్​బండ్ చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను ఉద్రిక్తతల నడుమ తొలగించారు. బారికేడ్లను తొలగించే క్రమంలో ఉత్సవ సమితి సభ్యులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్​పై విగ్రహాల నిమజ్జనానికి అనుమతిలేదంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉత్సవ సమితి సభ్యులు రోడ్డుపై బైఠాయించి జీహెచ్‌ఎంసీకి వ్యతిరేకంగా భారీ ఎత్తన నినాదాలు చేశారు. ఈ క్రమంలో ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు ఎందుకు నిలిపివేశారని, ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని పోలీసులను నిలదీశారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ట్యాంక్ బండ్ వద్దే గణేశ్‌ నిమజ్జనాలు చేస్తామని ఉత్సవ సమితి ప్రతినిధులు స్పష్టం చేశారు.