నిజాంపేట భవ్యాస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో అట్టహాసంగా వినాయక చవితి వేడుకలు
నిజాంపేటలోని భవ్యాస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. చవితి రోజున సాయంత్రం నాలుగు గంటలకు విగ్రహ ప్రతిష్ట చేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం బొజ్జ గణపయ్య విశేష పూజలందుకున్నాడు. సరస్వతి పూజ, కుంకుమ పూజ, కలువ పూజ, మహాగణపతి హోమం కార్యక్రమంలో విశేషంగా పాల్గొని తమ భక్తి ప్రపక్తులను ఘనంగా చాటుకున్నారు.రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు పిల్లలకు వివిధ ఆటలు, భక్తి సంబంధం కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారిలో ఐక్యత, భక్తి భావం పెంపొందడానికి గణేష్ ఉత్సవ కమిటీ చర్యలు గైకొంది. పంచలోహాలతో తయారై భక్తులను విశేషంగా ఆకట్టు కొన్న గణపయ్య ప్రతిరోజు అభిషేక పూజలందు కొన్నాడు.
అపార్ట్మెంట్ వాసుల అత్యంత ఆదరణ గొన్న కోలాటం పండుగకె ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భక్తి రసమైన ఎనిమిది పాటలకు 15 మందితో కూడిన భవ్యాస్ మహిళా బృందం పాటలకు అనుగుణంగా లయబద్ధంగా వేసిన స్టెప్పులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. చిన్నారులు ఆలపించిన కృష్ణాష్టకం, పాటలు, కూచిపూడి నృత్యం ప్రేక్షకుల మన్ననలు పొందాయి. నాలుగవ రోజున 54 ప్రసాదాలతో మహా నైవేద్యం సమర్పించారు. దీప్తి, అంజని, లక్ష్మి, శ్రీలత, అనుగన, స్వాతి, భారతి, రమ్య, విద్యాలక్ష్మి, స్వప్న, శిరీష, స్పందన, పుష్పలత, పర్ణిక, శ్రీహిత లతో కూడిన బృందం అనతి కాలంలోనే కోలాటంలో ప్రావీణ్యం సాధించి ఆహుతులను మైమరిపించారు. ఉట్టి కొట్టడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పిల్లలు,
పెద్దలు నృత్యం చేసుకుంటూ ఉట్టి కొట్టడానికి వెళుతుంటే చూపరులకు కనువిందె. వినాయక చవితికి ప్రధాన ఆకర్షణగా నిలిచే లడ్డు పాటలొ పోటీపడి రాజశేఖర్ ఒక లక్ష 11 వేలకు దక్కించుకొని తన భక్తి భావనను చాటుకున్నాడు.
చివరి రోజు అయిన నిమజ్జనం దినాన గణపతి దేవుణ్ణి ట్రాక్టర్ పై ఊరేగిస్తూ బ్యాండ్ మేళంకి అనుగుణంగా పోటీపడి నృత్యం చేస్తూ వీడ్కోలు పలికి గంగమ్మ ఒడికి చేర్చారు.