గణనాథుని సేవలో పోలీసు అధికారులు:
రంగపేటలో అన్నప్రసాద వితరణ
సూర్య - మానకొండూర్ :
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని రంగపేట గ్రామంలో వెలసిన గణనాథుని స్థానిక సీఐ శ్రీలత, ఎస్సై తిరుపతి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా సీఐ శ్రీలత మాట్లాడుతూ నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు విషయాలు పేర్కొన్నారు. నిమజ్జన ఊరేగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు పూర్తి బాధ్యత వహించాలని చెప్పారు.చెరువులు, కాలువల వద్దకు వెళ్లేటప్పుడు రక్షణ చర్యలు పాటించాలని, ముఖ్యంగా చిన్న పిల్లలను నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉంచాలని చెప్పారు.నిమజ్జన వాహనాల చోదకులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డీజీలకు పర్మిషన్లు లేవని పేర్కొన్నారు.రాత్రి వేళల్లో నిమజ్జనాలు జరిపే ప్రదేశాల్లో తగినంత విద్యుత్ దీపాలు, భద్రతా ఏర్పాట్లు సరిచూసుకోవాలని సూచించారని తెలిపారు.పోలీసు శాఖ ఇచ్చే ముందస్తు సూచనలు, నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్త రాంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి,తెలంగాణ గౌడ సంఘం మానకొండూరు మండల అధ్యక్షులు గుడాల మహేందర్ గౌడ్,గూడాల శ్రీనివాస్ గౌడ్, మందల బక్క రెడ్డి, రేవెల్లి రాజలింగం,మారెళ్ళ నాగిరెడ్డి,నాగుల సంపత్, కొక్కిరాల లక్ష్మారెడ్డి, గోపు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...