BREAKING
అమెరికాతో వివాదానికి తెరపడిన వేళ గ్రీన్‌లాండ్‌ జాతీయ పతాకం ప్రత్యేకతలివే: మంచు గడ్డపై అస్తమించని సూర్యుడి చిహ్నం రిమ్స్‌ అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ...రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గంటకు 350 కిలోమీటర్ల వేగం.. జపాన్‌కు సరిసాటిగా భారత్‌లోనే వేగవంతమైన బుల్లెట్ రైలు తయారీ! ఈనెల 28న సిపిఐ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చల్మెడ నేపాల్‌ను ముంచెత్తనున్న భారీ వర్షాలు: వరదలు, కొండచరియలు విరిగిపడే ముప్పుతో హై అలర్ట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ ఇంట తీవ్ర విషాదం.. తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత! ఆదిలాబాద్ రిమ్స్ లో అగ్నిప్రమాదం…ముగ్గురు శిశువుల మృతి మహారాష్ట్ర యూసీసీ కమిటీ నుంచి మాజీ న్యాయమూర్తి ఆర్సీ చవాన్ రాజీనామా: ప్రజాభిప్రాయ సేకరణ తీరుపై తీవ్ర అభ్యంతరం రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యులుగా సిపి రమేష్ బస్‌ డిపో పనులకు వేగం 70 శాతం పూర్తి.. దసరా నాటికి ప్రారంభానికి సన్నాహాలు 'మీకో దండం.. నా కాళ్లపై పడొద్దు'.. అభిమాని ప్రవర్తనపై డైరెక్టర్ అనిల్ రావిపూడి అసహనం! స్వాధీనం చేసుకున్న 2,400 ఎకరాల వివరాలు ఏవి? బస్‌ డిపో పనులకు వేగం 70 శాతం పూర్తి.. దసరా నాటికి ప్రారంభానికి సన్నాహాలు వినాయక వేడుకల్లో తీవ్ర విషాదం…విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

ఉద్యమకారులకు ప్రజా ప్రభుత్వం అండ: సీఎం రేవంత్ రెడ్డి కేదారి-పుష్పలత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటన

Select Suryaa Now
ఉద్యమకారులకు ప్రజా ప్రభుత్వం అండ: సీఎం రేవంత్ రెడ్డి  కేదారి-పుష్పలత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటన

హనుమకొండ / హైదరాబాద్:తెలంగాణ మలిదశ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో విశేష సేవలందించిన హనుమకొండకు చెందిన దివంగత లింగాల కేదారి - పుష్పలత దంపతుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. హనుమకొండలో ఒక సాధారణ హోటల్ నడుపుతూ, వ్యాపార కోణంతో కాకుండా కేవలం మానవతా దృక్పథంతో వ్యవహరించి ఉద్యమకారులకు, విద్యార్థులకు ఉచితంగా ఆహారం, టీ అందించిన గొప్ప మహానుభావులు కేదారి దంపతులని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... “అన్నం పరబ్రహ్మ స్వరూపమని, దానిని వృథా చేయకూడదని సమాజానికి అవగాహన కల్పించిన ఆ పుణ్యదంపతుల సేవలు అపూర్వమైనవి. ఉద్యమ సమయంలో వారు అందించిన సేవలకు గుర్తింపుగా, ప్రభుత్వం తరఫున వారి కుటుంబానికి చిన్న నివాళిగా రూ. 10 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నాం” అని తెలిపారు. సీఎం సహాయ నిధి (CMRF) ద్వారా ఈ మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులకు తక్షణమే అందజేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

ఇందిరమ్మ క్యాంటీన్లకు స్ఫూర్తి:

లింగాల కేదారి దంపతుల సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 'ఇందిరమ్మ క్యాంటీన్ల' ద్వారా వీలైనంత ఎక్కువ మందికి తక్కువ ధరకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఉద్యమకారుడు మండల రాజు కుటుంబానికి రూ. 5 లక్షలు:

దీంతోపాటు, 2013 మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలుకు వెళ్లిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొర్లవీడుకు చెందిన ఉద్యమకారుడు మండల రాజు (34) కుటుంబానికి అమరుల కోటా కింద రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. ఉద్యమకారులను మరియు అమరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సీఎం పునరుద్ఘాటించారు.