8వేల ఎకరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య
2,400 ఎకరాల స్వాధీనం వివరాలు చెప్పాలని డిమాండ్.
ఆర్టీఐ ద్వారా వివరాలు కోరి, న్యాయపోరాటం చేస్తామని వెల్లడి
సూర్య రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల జిల్లాలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు బదిలీ అయ్యాయని,వాటిలో 2,400 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పందించారు.ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తోట ఆగయ్య, బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉంటే 8 వేల ఎకరాలకు సంబంధించిన గ్రామాలు,సర్వే నంబర్లు,భూములు ఎవరికి బదిలీ అయ్యాయి, 2,400 ఎకరాల్లో ఎక్కడెక్కడ భూమిని స్వాధీనం చేసుకున్నారో ప్రజలకు వెల్లడించాలని తోట ఆగయ్య కోరారు.ఈ అంశంపై ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నామని,అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
సిరిసిల్ల పర్యటనలో భాగంగా భూముల వివరాలను వెల్లడించి సిరిసిల్ల పర్యటనకు రావాలని లేనియెడల అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాస్తూ సిరిసిల్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.