BREAKING
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడుల ఉధృతి: ముగ్గురు మృతి.. ఐరాస సదస్సు కోసం అమెరికాలో జెలెన్‌స్కీ అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు: దసరా ముందే పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు! నిజాంపేట భవ్యాస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో అట్టహాసంగా వినాయక చవితి వేడుకలు వినాయక నిమజ్జనానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా మేడ్ ఇన్ ఇండియా స్థాయి నుంచి ఇమాజిన్డ్ ఇన్ ఇండియా దిశగా సాగాలి: ఆవిష్కరణల ఆధారిత వృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపు ఈసీఈలో కల్లకుంట సునీలకు పీహెచ్.డీ. బెర్లిన్ ఎన్నికల్లో వామపక్షాల విజయం: వలసదారుల్లో చిగురించిన ఆశలు.. తీవ్ర మితవాద ఏఎఫ్‌డీ ఎదుగుదలపై కలవరం జగన్‌తో భేటీపై షర్మిల స్పష్టత: “అవన్నీ కట్టుకథలే.. పెళ్లి శుభకార్యాన్ని రాజకీయాలకు ముడిపెట్టొద్దు” ఇరాన్ అధ్యక్షుడితో పాక్ హోం మంత్రి కీలక భేటీ: అమెరికాతో ఉద్రిక్తతల వేళ సరిహద్దు భద్రతపై సమాలోచనలు ప్రభుత్వ నిర్లక్ష్యం.. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం వికారాబాద్ జిల్లాలో కలకలం రేపిన అవినీతి ఆరోపణలు.. రూ. 20 వేలు డిమాండ్ చేస్తున్నారంటూ మాజీ సర్పంచ్ ఆవేదన బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాజాబాబుకు చక్రాల కుర్చీ.. కుటుంబానికి కొత్త ఆశ వికారాబాద్ లో వినాయక మండపాలను సందర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Select Suryaa Now
రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు  - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు

- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

 

 సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి

రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సభ పెడుతున్నాడంటేనే బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ వెన్నులో గుబులు పుడుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈనెల 30న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి బహిరంగ సభ సందర్భంగా మంగళవారం స్థానిక కే కన్వెన్షన్ హాల్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పదేళ్ల కాలంలో కేటీఆర్ సిరిసిల్ల ప్రజలకు చేసింది ఏమిటంటే అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం నేతన్నలకు 300 కోట్లకు పైగా బకాయిలు పెడితే ఆ బకాయిలు తీర్చి నేత కార్మికులకు అండగా ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. వేములవాడ రాజన్న గుడిని 250 కోట్లకు పైగా వెచ్చించి అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వేములవాడ రాజన్న సన్నిధిలో హశ్చాత్తాప పడాల్సింది సీఎం రేవంత్ రెడ్డి కాదని, గుడిని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చి తప్పిన కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ లు రాజన్న సన్నిధిలో ముక్కు నేలకు రాసి చెంపలు వేసుకోవాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సభను లక్ష మందితో విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీలోని ప్రతి నాయకుడు ప్రజాప్రతినిధి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణాన్ని అధికారులతో కలిసి కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం,సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సూర దేవరాజు తోపాటు అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.