గణేష్ నిమజ్జనం నేపథ్యంలో 3 రోజులు మద్యం దుకాణాలు బంద్
సూర్య జగిత్యాల ప్రతినిధి: గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలో మద్యం దుకాణాలు, బార్‌లు, కల్లు దుకాణాలను మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 71 మద్యం దుకాణాలు, 20 బార్‌లు, 304 తెల్లకల్లు దుకాణాలు సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం నుంచి 25వ తేదీ ఉదయం వరకు మూసివేయనున్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వెల్లడించారు.