అనంతారం బిక్కవాగు వంతెన పై రెండో రోజు కొనసాగుతున్న ఆమరణ నిరాహార దీక్ష.
హామీ ఇచ్చి మర్చిన మానకొండూరు ఎమ్మెల్యే "కవ్వంపెల్లి"
సూర్య. ఇల్లంతకుంట….
ఇల్లంతకుంట -ఆనంతారం గ్రామాల మధ్య వున్న బిక్కవాగు పై నిర్మించిన వంతెన నిర్మాణం పనులను పూర్తి చేపిస్తానని మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చి ఏడాది గడిచిన పనులను చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ ఆనంతారం గ్రామానికి చెందిన యువజన సంఘాల అధ్యక్షులు అక్కేం నాగరాజు ఆమరణ దీక్ష మంగళవారం కూడా కొనసాగుతుంది. రాజకీయ పార్టీలకతీతంగా నాయకులు దీక్ష శిభిరంను సందర్శించి సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో కముటం రాములు,చొప్పరి రాంచంద్రం,వొళ్ళాల రవి, ఆకుల శ్రీనివాస్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.