BREAKING
శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్టీయు కృత్రిమ మేధస్సు ప్రమాదాల కట్టడికి గ్లోబల్ రెగ్యులేటరీ సంస్థ: 20 దేశాల కీలక ఉమ్మడి ప్రతిపాదన గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత వీఎల్‌ఎస్‌ఐ సాంకేతికతతో తదుపరి తరం బయోసెన్సర్‌ డిజైన్‌పై వర్క్‌షాప్ రాయవరంలో వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక ద్రవ్యోల్బణ సెగతో ఆర్బీఐ కీలక నిర్ణయం?: 2026లో రెండుసార్లు వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చన్న నివేదిక ఐరాస వేదికగా దౌత్య పర్వం పాకిస్తాన్‌లో మరో పరువు హత్య: నవవధువును కాల్చి చంపిన సొంత సోదరుడు.. కరాచీలో దారుణం ప్రభుత్వ కార్యాలయంలోనే దొంగతనం.. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం తప్పనిసరి నల్ల సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛకు భారత్ సహకారం స్లాఘనీయం హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంలో కలకలం.. కొండచిలువతో డాన్సులు చేసిన వైజాగ్ గ్యాంగ్ అరెస్ట్ అక్టోబర్ 16న రాజ్యసభ ఎన్నికలు: ఉత్తరప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో 1 స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విద్యార్థి ఆత్మహత్య ఘటనతో ఐఐటీ బాంబే కీలక నిర్ణయం: హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు: మేడ్చల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం

దివ్యాంగులకు చేయూత.. ఉపకరణాల గుర్తింపు

Select Suryaa Now
దివ్యాంగులకు చేయూత.. ఉపకరణాల గుర్తింపు

చౌటుప్పల్‌,:ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు అవసరమైన సహాయక ఉపకరణాలను గుర్తించేందుకు భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్‌లోని భవిత కేంద్రంలో గుర్తింపు శిబిరం నిర్వహించారు. పురపాలక చైర్మన్‌ మొగుదాల పావని రమేష్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ గోశిక వినయ్‌కుమార్‌ శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా దివ్యాంగుల అవసరాలను పరిశీలించి, వారికి అవసరమైన కృత్రిమ అవయవాలు, ఇతర సహాయక ఉపకరణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ తెలిపారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా ఐఈ కోఆర్డినేటర్‌ లింగారెడ్డి, ఏఈఓ గురువారావు, కౌన్సిలర్లు పాక చిరంజీవి, బద్రి గాలయ్య, పిల్లలమర్రి మధుసూదన్‌, దేప రమ్య రాజు, ఉడుగు జ్యోతి రమేష్‌, బత్తుల జయమ్మ దాసు,ఎండీ బాబా షరీఫ్‌, ఫిజియోథెరపిస్ట్‌ డా. గుండెబోయిన రమేష్‌యాదవ్‌, ఆర్థోపెడిషియన్‌ డా. అవినాష్‌, ఐఆర్పీ రాంచంద్రు నాయక్‌, డివిజన్‌, మండలాల ఐఆర్పీలు, మారుపాక భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.