మచిలేస్వరి వీరభద్ర స్వామి టెంపుల్ దర్శించుకున్న ప్రభుత్వ విప్ దంపతులు
*మాచిలేశ్వర్ శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో బీర్ల అయిలయ్య దంపతుల ప్రత్యేక పూజలు.*
హైదరాబాద్: నార్సింగి పరిధిలోని మంచిరేవుల మాచిలేశ్వర్ శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు తన సతీమణి బీర్ల అనిత* గారితో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి, శ్రీ వీరభద్రస్వామి వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య గారు, బీర్ల అనిత గారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య దంపతులు స్వామివారిని ప్రార్థించారు.