telanagana
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి - కలెక్టర్ కుమార్ దీపక్
సూర్య, మంచిర్యాల టౌన్ : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, వైద్య పరికరాలు, రిజిస్టర్లు, గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు, చిన్నారుల చికిత్స విభాగం, ఐసీయూ గదులు, పడకలు, పిల్లల విభాగంలోని ఏసీలు, పరిసరాలను తనిఖీ చేశారు. ఆసుపత్రికి ప్రతిరోజూ వచ్చే రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని, మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, వైద్య పరికరాలు, రిజిస్టర్లు, గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు, చిన్నారుల చికిత్స విభాగం, ఐసీయూ గదులు, పడకలు, పిల్లల విభాగంలోని ఏసీలు, పరిసరాలను తనిఖీ చేశారు. ఆసుపత్రికి ప్రతిరోజూ వచ్చే రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని, మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, వారి బరువు, అందిస్తున్న వైద్య సేవల గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్యులకు సూచించారు.వైద్యులు, సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఆసుపత్రిలో అదనపు సదుపాయాలు, వైద్య పరికరాలు, ఏసీలు అవసరమైతే వాటికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.మరమ్మతులకు గురైన పరికరాలు, ఇతర సదుపాయాలకు వెంటనే మరమ్మతులు చేయించి రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఆసుపత్రి అధికారులు కోరిన అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఆసుపత్రి ప్రాంగణంలో మద్యం సేవించి వచ్చి గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఆసుపత్రిలో ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగిస్తూ రోగులు, వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.