BREAKING
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు. *శాంతియుత వాతావరణంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవలి* మధిర రూరల్ ఎస్.ఐ. విశ్వతేజ నాకు మా నాన్న కావాలి... చిన్నారి సమాధానానికి కదిలిన హృదయాలు వేగవరంలో సేవా సంకల్ప అభియాన్‌ మెడికల్ క్యాంపు దుర్గా పూజ వేళ అస్సాం తేయాకు కార్మికులకు శుభవార్త అన్నపూర్ణ దేవి అలంకరణలో అనఘా లక్ష్మీ అమ్మవారు. కుందుర్పి ప్రతినిధి *ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు* స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక! ఉపాధి కూలీలకు స్నాక్స్ పంపిణీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ పెద్దపల్లి ఎస్సైగా గుమ్ముల రాజశేఖర్‌ మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ రాజు ను పరామర్శించిన ఎమ్మెల్సీ ఒకే రోజు 355 మందికి 1 కోటి 55 లక్షలుసీఎంఆర్ఎఫ్ సాయం. వైద్యానికి ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి నిమ్మల విజ్ ఎయిర్ దూకుడు

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం - కలెక్టర్ రాజర్షిషా

Select Suryaa Now
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం - కలెక్టర్ రాజర్షిషా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి భద్రత, ప్రమాదాల నివారణ చర్యలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 'బ్లాక్ స్పాట్స్'ను గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రహదారుల పక్కన ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని, గుంతలు పడిన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ప్రమాద సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, రేడియం లైట్లు, బ్లింకర్లను ఏర్పాటు చేసి భద్రతను పటిష్టం చేయాలని సూచించారు. పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో నిరంతరం వాహన తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. కేవలం జరిమానాలకే పరిమితం కాకుండా విద్యార్థులు, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, ప్రాణ రక్షణ కంటే ఏదీ ముఖ్యం కాదని పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మితిమీరిన వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటు బెల్టు ధరించకపోవడం వల్లే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణను ప్రతి ఒక్కరు పోలీస్ శాఖకు సహకారం అందించాలని, ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డిహెమ్హెచ్ఓ సాధన, రవాణా శాఖ అధికారి కిషోర్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, జాతీయ రహదారుల సంస్థ, , మున్సిపల్, పంచాయతీ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.