BREAKING
సామాజిక సేవకు గుర్తింపుగా అందుకున్న అంతర్జాతీయ అవార్డుపై సుమన్ అభినందనలు ఇంకొల్లు మండలంలో ఎమ్మెల్యే ఏలూరి పర్యటన రెండేళ్లలో మొత్తంగా 837 మందికి రూ.7కోట్ల 22 లక్షలు దాటిన ముఖ్యమంత్రి సహాయనిధి సాయం కూకట్‌పల్లిలో గంజాయి కలకలం ట్యునీషియాలో వేగంగా క్షీణిస్తున్న పత్రికా స్వేచ్ఛ...జైలు శిక్షల భయంతో వణుకుతున్న విలేకరులు డిండి ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదు స్పానిష్ ముందస్తు ఎన్నికల సర్వేలో అధికార సోషలిస్టు పార్టీ ఆధిపత్యం రోడ్లపై అక్రమ పార్కింగ్, ఆక్రమణలు తొలగింపు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఎస్ఐ చంద్రకుమార్ ఎంఎల్‌ఏ బావమరిదికి నివాళులు పామూరు ముంగిట్లోకి ‘ఊపాస్‌’ ఎముకల వైద్యం! అభివృద్ధి చెందుతున్న దేశాల రుణ భారతంపై ప్రత్యేక దృష్టి సారించనున్న బ్రిటన్ గంగవరం బీసీ కాలనీలో వర్షపు నీటి సమస్యకు పరిష్కారం కల్తీ నెయ్యి కేసులో ఈడీ సంచలనం పిన్నింటి రమణ కు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్ బతుకమ్మ సంబరాలతో మార్మోగిన ప్రియదర్శిని కళాశాల ప్రాంగణం

ప్రజా సంక్షేమ ఫలాలతో ప్రతి కుటుంబానికి లబ్ది

Select Suryaa Now
ప్రజా సంక్షేమ ఫలాలతో ప్రతి కుటుంబానికి లబ్ది

అచ్చంపేట, సూర్య ప్రతినిధి :రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందని కుటుంబం లేదని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత మూడేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.1,64,431 కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని వెల్లడించారు. ఈ లెక్కలపై ఎవరితోనైనా చర్చించేందుకు, ఎలాంటి సవాల్‌నైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి రూపాయిని వారి అభివృద్ధి, సంక్షేమం కోసమే ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రూ.74.82 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. మన్ననూరులో 220/33 కేవీ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసినంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి రూ.90 వేల కోట్లు కేటాయించామని, జిల్లాల్లోని సహజ వనరులు, ఖనిజ సంపద ఆధారంగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అచ్చంపేట ప్రాంతాన్ని ప్రధాన రవాణా కూడలిగా, ఎకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్ది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో కోటి 15 లక్షల కుటుంబాలు ఉండగా, కోటి ఆరు లక్షల కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనాలు అందుతున్నాయని భట్టి విక్రమార్క వివరించారు. పేదల ఆహార భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, కోటి ఆరు లక్షల కుటుంబాలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. 43 లక్షల కుటుంబాలకు పింఛన్లు, 71.40 లక్షల మంది రైతులకు రైతు భరోసా, 53 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, ఇప్పటివరకు సుమారు 76 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని వెల్లడించారు.

పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని, కేవలం అచ్చంపేట నియోజకవర్గంలోనే 7,300 ఇళ్లను మంజూరు చేసి ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, రాగిజావ అందిస్తున్నామని, కళాశాలల్లో 12 లక్షల మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నామని చెప్పారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో నవంబర్ 19న ఇందిరమ్మ జయంతి సందర్భంగా కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి కుటుంబానికి వర్తించేలా 'ఇందిరమ్మ జీవిత బీమా' పథకాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

అచ్చంపేట నియోజకవర్గంలో ఇప్పటికే రూ.75 కోట్లతో 1,219 కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, 403 కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలోని సహజ సౌందర్యాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక గిరిజనులు, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సమయంలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు.