BREAKING
అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు. ఎస్. పి.పోలింగ్ స్టేషన్ లు పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి ధనలక్ష్మిగా వాసవి మాత 1.5 కోట్ల రూపాయలతో అలంకరణ ఆస్ట్రేలియా విధానాలపై ఫిర్మస్ సీఈఓ వ్యాఖ్యలు...! వైట్ హౌస్ నూతన ప్రెస్ సెక్రటరీ కేటీ జాచారియాస్ లీగల్ కెరీర్‌పై పెరుగుతున్న నిశిత పరిశీలన కరెంట్ షాక్‌తో జూనియర్ లైన్‌మెన్ మృతి! భూభారతి పోర్టల్ కు సాంకేతిక సమస్యలు మైక్రాన్ సమ్మె సన్నద్ధత వేళ తైవాన్ అధ్యక్షుడి పిలుపు ఏఐ డిమాండ్‌ను పెంచేందుకు లాభాల మార్జిన్లను తగ్గించుకోవడానికైనా సిద్ధమే మార్కెట్ అంచనాలను అధిగమించిన ఎరిక్సన్ కోర్ లాభాలు అప్‌స్ట్రీమ్ చమురు, గ్యాస్ ఫండింగ్‌కు అనుమతించాలన్న ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ గ్లోబల్ మార్కెట్‌లో చైనా ఎగుమతుల హవా వడ్డీ రేటును వరుస పెంపుల ఆరంభంగా భావించవద్దు...బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ చీఫ్ ఎకనామిస్ట్ హ్యూ పిల్ మార్కెట్ అంచనాలను అందకోలేకపోయిన నోర్డియా బ్యాంక్ మూడో త్రైమాసిక లాభాలు యూరోపియన్ మార్కెట్లలో ఆసియా సంకేతాలతో నష్టాల్లో ట్రేడింగ్

పోలీస్ కమిషనరేట్‌లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
పోలీస్ కమిషనరేట్‌లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

సూర్య కరీంనగర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో
బుధవారం రాత్రి మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది కోసం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో మహిళా పోలీసులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు, నృత్యాలతో పరేడ్ గ్రౌండ్ పండుగ శోభను సంతరించుకుంది.ఈ వేడుకలకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శివకుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పోలీసు కుటుంబాల్లోనూ పండుగ ఆనందం నింపాలనే ఉద్దేశంతో..

ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ, పండుగల సమయంలో ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం బందోబస్తు విధుల్లో నిమగ్నమై ఉంటారని తెలిపారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ రోజున విధుల కారణంగా పోలీసు సిబ్బందికి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే అవకాశం పరిమితంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగులు, సిబ్బంది కూడా బతుకమ్మ పండుగ ఆనందాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో ముందస్తుగా ప్రత్యేక వేడుకలు నిర్వహించినట్లు వివరించారు.

పోలీసుల సేవలు అభినందనీయం

ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శివకుమార్ మాట్లాడుతూ, ప్రజలు తమ ఇళ్లలో ప్రశాంతంగా, సురక్షితంగా పండుగలు జరుపుకోవడంలో పోలీసుల నిరంతర సేవలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పండుగల వేళ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే పోలీసు సిబ్బంది సేవలను అభినందించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

సీపీ చొరవపై అతిథుల ప్రశంసలు

మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఎఫ్‌ఓ సత్యనారాయణ మాట్లాడుతూ, పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పండుగ వేడుకల్లో ఆనందంగా పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. పోలీసు సిబ్బంది అందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, మహిళా అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.