BREAKING
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి ధనలక్ష్మిగా వాసవి మాత 1.5 కోట్ల రూపాయలతో అలంకరణ ఆస్ట్రేలియా విధానాలపై ఫిర్మస్ సీఈఓ వ్యాఖ్యలు...! వైట్ హౌస్ నూతన ప్రెస్ సెక్రటరీ కేటీ జాచారియాస్ లీగల్ కెరీర్‌పై పెరుగుతున్న నిశిత పరిశీలన కరెంట్ షాక్‌తో జూనియర్ లైన్‌మెన్ మృతి! భూభారతి పోర్టల్ కు సాంకేతిక సమస్యలు మైక్రాన్ సమ్మె సన్నద్ధత వేళ తైవాన్ అధ్యక్షుడి పిలుపు ఏఐ డిమాండ్‌ను పెంచేందుకు లాభాల మార్జిన్లను తగ్గించుకోవడానికైనా సిద్ధమే మార్కెట్ అంచనాలను అధిగమించిన ఎరిక్సన్ కోర్ లాభాలు అప్‌స్ట్రీమ్ చమురు, గ్యాస్ ఫండింగ్‌కు అనుమతించాలన్న ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ గ్లోబల్ మార్కెట్‌లో చైనా ఎగుమతుల హవా వడ్డీ రేటును వరుస పెంపుల ఆరంభంగా భావించవద్దు...బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ చీఫ్ ఎకనామిస్ట్ హ్యూ పిల్ మార్కెట్ అంచనాలను అందకోలేకపోయిన నోర్డియా బ్యాంక్ మూడో త్రైమాసిక లాభాలు యూరోపియన్ మార్కెట్లలో ఆసియా సంకేతాలతో నష్టాల్లో ట్రేడింగ్ దీర్ఘకాలిక యుద్ధమే మధ్యప్రాచ్య ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు

నేడు సచివాలయంలో మంత్రులతో కీలక భేటీ

Select Suryaa Now
నేడు సచివాలయంలో మంత్రులతో కీలక భేటీ

హైదరాబాద్, సూర్య ప్రతినిధి :రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం మరియు భానుడి ప్రతాపంతో ఉత్పన్నమయ్యే సవాళ్లపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ కీలక భేటీలో రాష్ట్రవ్యాప్తంగా తాగు, సాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

ఈ సమావేశంలో ప్రధానంగా ఎల్‌నినో ప్రభావం వల్ల రాబోయే ఎనిమిది నెలల పాటు ఎదురయ్యే విద్యుత్, నీటి కొరత ముప్పును తట్టుకునేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను (Action Plan) రూపొందించనున్నారు. ముఖ్యంగా పంటల రక్షణ కోసం రైతులకు నిరంతరాయంగా సాగునీరు, విద్యుత్ అందించడం, పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయడంపై దృష్టి సారించనున్నారు. కరవు ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులను భాగస్వాములను చేస్తూ గ్రామీణ స్థాయి నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, వార్ రూమ్‌లు ఏర్పాటు చేయడంపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.