మెదక్ జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన
మెదక్ జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన
కేంద్రీయ విద్యాలయానికి అనువైన భవనాలు, స్థలాల గుర్తింపుపై అధికారుల పరిశీలన మెదక్ జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు అవసరమైన భవనాలు, స్థలాలను గుర్తించే ప్రక్రియలో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. రాజు విద్యాశాఖ కోఆర్డినేటర్ రాజు బుధవారం మెదక్ పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ..మెదక్ పట్టణంలోని ధ్యాన్చంద్ సర్కిల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలను అధికారులు సందర్శించి, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సంబంధించి అందుబాటులో ఉన్న భవనాలు, స్థలాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, జిల్లాలో విద్యా అవకాశాలను మరింత విస్తరించేందుకు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కీలకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.మెదక్ జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసే నేపథ్యంలో, పాఠశాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తించడం, అందుబాటులో ఉన్న మౌలిక వసతుల పై దృష్టి సారించారు.
గుర్తించిన అంశాలు, స్థలాలకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పిస్తమన్నారు.కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అవసరమైన స్థల గుర్తింపు, సంబంధిత వివరాల సేకరణలో భాగంగా ఈ పరిశీలన చేపట్టినట్లు అధికారులు తెలిపారు.