పంచాయతీ కార్మికులకు దసరా కానుకగా దుస్తుల పంపిణీ
సూర్య తిర్యాణి : తిర్యాణి, దసరా పండుగను పురస్కరించుకొని మందడగు గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్లకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుంరం గోపాల్, ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి సాయిరాం గౌడ్ పాల్గొని కార్మికులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాత్రి పగలు తేడా లేకుండా విధులు నిర్వహిస్తూ గ్రామానికి సేవలందిస్తున్న కార్మికుల కృషి అభినందనీయమన్నారు. గ్రామంలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ముందుండి సహకరిస్తున్న వర్కర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామపంచాయతీ పనులు సక్రమంగా సాగడంలో వారి సహకారం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.కార్మికుల సేవలకు కృతజ్ఞతగా పండుగ సందర్భంగా దుస్తులు అందజేసినట్లు తెలిపారు. వర్కర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.