BREAKING
కొర్రపాటి కిరణ్ జన్మదిన సందర్భంగా దివ్యాంగులకు గృహపకరణాలు పంపిణీ ఆర్థిక సాయం ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా సందర్శించి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కుర్ని దైవాచార సంఘం ప్రతినిధికి బుట్టా పరామర్శ ఉట్కూరు గురుకుల పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్ అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు: చంద్రబాబు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి ముగిసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీలు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కొందుర్గు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాడిగల్ల మహేందర్ కొత్తచెరువు సమస్యను పరిష్కరించాలని ఎమ్మార్వో కు వినతి రూ.1,789.52 కోట్లతో ఐటీఎంఎస్‌.. 42 ప్రధాన ట్రాఫిక్‌ కారిడార్లలో అమలు హరిహరులను విభజించే హక్కు ఎవరిచ్చారు కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాఫీ విత్ కరణ్ షోకు తెరదించిన కరణ్ జోహార్.. సెలెబ్రిటీ కెరీర్‌లను ముగించిన ఐకానిక్ టాక్ షో ముగింపు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

 పెండింగ్ దరఖాస్తులను 10 రోజుల్లో పూర్తి చేయాలి

Select Suryaa Now
 పెండింగ్ దరఖాస్తులను 10 రోజుల్లో పూర్తి చేయాలి

కొందుర్గ్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.చంద్రా రెడ్డి సందర్శించి, తహసీల్దార్ మరియు సిబ్బందితో వివిధ రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
        ఈ సందర్భంగా భూ భారతి పెండెన్సీ, రీ-సర్వే పనుల పురోగతి, మండలంలో పెండింగ్‌లో ఉన్న వివిధ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ దరఖాస్తుల స్థితిగతులు, ఎఫ్-లైన్ పిటిషన్ల పరిష్కారంపై సమీక్షించారు.
        పెండింగ్‌లో ఉన్న ప్రతి దరఖాస్తును పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్ మరియు సిబ్బందిని ఆదేశించారు.
        సమీక్షించిన అన్ని అంశాల్లో ఉన్న పెండెన్సీలను 10 రోజుల్లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని, ప్రతి అంశంపై తీసుకున్న చర్యలు, సాధించిన పురోగతిపై సమగ్ర కంప్లయన్స్ నివేదికను సమర్పించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
        పెండింగ్ కేసుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రజలకు నిర్ణీత సమయంలో సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

శేరిబాయి  గణేష్ : మేజర్ న్యూస్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి.