పత్తి,మొక్కజొన్న పంట లను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం
పత్తి,మొక్కజొన్న పంట లను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం
కుకునూరుపల్లి, . మండల పరిధిలోని లకడారం గ్రామంలో బుధవారం పత్తి మొక్కజొన్న పంటలను పరిశీలించిన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, సిద్దిపేట వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల శాస్త్రవేత్తల బృందం, ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ప్రత్తిలో రసం పిల్చు పురుగుల ఉదృతి గమనించి వాటి నివారణకు ఎసిపేట్ 1.5 గ్రా. లేదా ఎసిటమిప్రిడ్ ౦.2 గ్రా. లేదా థైయోమెథాక్సమ్ ౦.2 గ్రా. లేదా ఎమిడాక్లోప్రిడ్ ౦.25 మీ.లి ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసికోవాలి సూచించారు. ఆకుల ఎరుపు లేదా పండాకుగా మారుతున్నట్లు గమనిస్తే 10 గ్రా. మాగ్నెషియం సల్ఫేట్ + 2 గ్రా జింక్ సల్ఫేట్ + 2 గ్రా బోరాన్ ను కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. ప్రస్తుతం మొక్కజోన్న పీచు దశలో ఉంది. మొక్కజోన్న లో కత్తెర పురుగు ఉదృతి గమనించినట్లైతే దాని నివారణకు క్లోరాంట్రానీలిప్రోల్ 0.4 మీ.లి/ లీ లేదా స్పైనోటోరామ్ ౦.5 మీ.లి ఒక లీటరు నీటికి కలిపి మొక్క సుడిలో మందు ద్రావణం పడేటట్టు పిచికారి చేసుకోవాలని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పల్లవి డాక్టర్ సరిత మండల వ్యవసాయ శాఖ అధికారం గోవిందరాజు కందూరి ఐలయ్య రైతులకు పాల్గొన్నారు.