పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోండి
*పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోండి*
*ధర్మసాగర్ ఎమ్మార్వో భావు సింగ్*
ధర్మసాగర్ అక్టోబర్ 1 మేజర్ న్యూస్ సూర్య... హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పట్టభద్రులైన ప్రతి ఒక్కరు అమౌంట్ నమోదు చేసుకోవడానికి ఈనెల ఆరవ తారీకు చివరి తేదీగా ప్రభుత్వ నిర్ణయించిందని ఎమ్మార్వో భావు సింగ్ తెలిపారు. ఈ ఓటర్ నమోదు కోసం ఫామ్18 తో తమ డిగ్రీ ఏదైనా యూనివర్సిటీ నుండి పొందిన సర్టిఫికెట్, ఎస్ఎస్సి మెమో, ఆధార్ కార్డు, సాధారణ ఓటర్ ఐడి జిరాక్స్ తో పాటు ఓటర్ ఫోన్ నెంబర్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జతపరచి సంబంధిత వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్ చేసుకోవాలని ఎమ్మార్వో కోరారు.