పైసా అయిన పరుల సొమ్మే కదా అని
పైసా వచ్చినా పరుల సొమ్మె కదా...అని
===========≠====
పెనుబల్లి మండల కేంద్రంలో విచిత్ర దొంగతనం
----------------------------------
ఉమ్మడి ఖమ్మంజిల్లా బ్యూరో చీఫ్ / పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్...
డబ్బు కోసం, వెండి, బంగారు నగల కోసం, విలువైన వస్తువుల కోసం దొంగతనాలు జరగడం మనం వినే ఉంటాం. కానీ వంట పాత్రలు అవీ రాతెండి పాత్రలు మాత్రమే అపహరించిన విచిత్ర దొంగతనం మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. పెనుబల్లి బీసీ కాలనీకి చెందిన లక్ష్మి అనే ఒంటరి మహిళ తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా పూరి పాకలో చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తూ తన కుమారుడు, కుమార్తెను పోషించుకుంటుంది. ఆదివారం మూసి వున్న హోటల్ లోకి కొందరు గుర్తు తెలియని ప్రవేశించి క్యాటరింగ్ పాత్రలు, వంట పాత్రలు, దోశ పెనుము, ఇతర చిన్న, చితక వంటకు ఉపయోగించే సుమారు రూ. 30 వేలు విలువ కలిగిన రాతెండి పాత్రలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం హోటల్ నడుపుదామని వచ్చి చూసేసరికి దానికి సంబంధించిన పాత్రలు కనిపించకపోవడం హోటల్ వెనుక భాగంలో తాటాకులు తొలగించడం చూసి దొంగతనం జరిగినట్లు గ్రహించి ఆందోళన చెందుతూ భాధితురాలు లక్ష్మి విఎం బంజర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.